Page Loader
IndiGo: ఇండిగోలో సాంకేతిక లోపం.. దేశ వ్యాప్తంగా విమాన సేవలపై తీవ్ర ప్రభావం 
ఇండిగోలో సాంకేతిక లోపం.. దేశ వ్యాప్తంగా విమాన సేవలపై తీవ్ర ప్రభావం

IndiGo: ఇండిగోలో సాంకేతిక లోపం.. దేశ వ్యాప్తంగా విమాన సేవలపై తీవ్ర ప్రభావం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2024
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. చెక్-ఇన్‌ ప్రక్రియలు నెమ్మదిగా సాగడంతో పాటు, టికెట్ బుకింగ్‌లలో సైతం సమస్యలు ఎదురవుతున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చెక్-ఇన్ కోసం క్యూలలో నిలబడి, తమ అసౌకర్యాన్ని సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోల రూపంలో పంచుకుంటున్నారు. సాంకేతిక లోపంపై ఇండిగో 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.

Details

సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి

తమ నెట్‌వర్క్‌లలో తాత్కాలికంగా వ్యవస్థలు నెమ్మదించాయని, దీని ప్రభావం వెబ్‌సైట్‌, బుకింగ్‌ సిస్టమ్‌ పైన పడిందని పేర్కొంది. చెక్‌-ఇన్‌లు ఆలస్యంగా జరుగుతున్నాయని, అయితే తమ ఎయిర్‌పోర్టు బృందం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలను అందించేందుకు కృషి చేస్తోందన్నారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇండిగో స్పష్టం చేసింది.