
Inflation: తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదు.. జూన్‌లో తెలంగాణలో -0.93%, ఏపీలో 0% నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
జూన్ నెలలో దేశవ్యాప్తంగా నమోదైన ద్రవ్యోల్బణ రేటుతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత తక్కువగా నమోదైంది. దేశంలో గత నెలలో సగటు ద్రవ్యోల్బణం 2.10 శాతంగా నమోదైనప్పటికీ, తెలంగాణలో -0.93 శాతంగా, ఆంధ్రప్రదేశ్‌లో 0 శాతంగా నమోదైంది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో -1.54 శాతం, పట్టణ ప్రాంతాల్లో -0.45 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో -0.55 శాతం, పట్టణ ప్రాంతాల్లో 1.06 శాతం ద్రవ్యోల్బణం నమోదైనట్లు కేంద్ర గణాంకాలశాఖ సోమవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.
వివరాలు
కేరళ 6.71 శాతంతో మొదటి స్థానం
ద్రవ్యోల్బణ రేటు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల విషయంలో కేరళ 6.71 శాతంతో మొదటి స్థానంలో, పంజాబ్ 4.67 శాతంతో రెండవ స్థానంలో, ఉత్తరాఖండ్ 3.40 శాతంతో మూడవ స్థానంలో నిలిచాయి. తెలంగాణలో మైనస్ ద్రవ్యోల్బణం కొనసాగుతుండగా, 1 శాతం లోపు ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు బిహార్ (0.75 శాతం) కూడా ఉంది.