Tenneco Clean Air IPO: టెన్నెకో క్లిన్ ఎయిర్ IPO అలాట్‌మెంట్ ఇవాళే: ఇలా చెక్ చేసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
టెన్నెకో క్లిన్ ఎయిర్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) షేర్ అలాట్‌మెంట్ ఇవాళ ఫైనల్ కానుంది. ఈ ఇష్యూ కు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం సబ్స్క్రిప్షన్ రేటు 61.79 రెట్లు నమోదైంది. రిటైల్ ఇన్వెస్టర్లు 5.37 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIBs) 174.78 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NIIs) 42.79 రెట్లు సబ్స్క్రైబ్ చేసినట్టు నవంబర్ 14 నాటికి డేటా వెల్లడించింది.
వివరాలు
IPO వివరాలు
₹3,600 కోట్ల విలువైన ఈ బుక్-బిల్ట్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలోనే వచ్చింది. అంటే కంపెనీకి కొత్తగా నిధులు రావు, ప్రస్తుత షేర్‌హోల్డర్లు షేర్లు అమ్మినట్టే. నవంబర్ 12న ప్రారంభమైన సబ్స్క్రిప్షన్ విండో 14న ముగిసింది. ఒక్కో షేర్ ధర ₹378-₹397 మధ్యగా నిర్ణయించారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 37 షేర్ల ఒక్క లాట్ కోసం ₹14,689 పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది.
వివరాలు
అలాట్‌మెంట్ ఎలా చెక్ చేసుకోవాలి?
BSE వెబ్‌సైట్: IPO అలాట్‌మెంట్ పేజీలోకి వెళ్లి 'Equity' ఎంపిక చేసి 'Tenneco Clean Air India Limited' ను సెలెక్ట్ చేయాలి. తరువాత మీ అప్లికేషన్ నంబర్, PAN నంబర్ ఎంటర్ చేసి 'Search' క్లిక్ చేయాలి. MUFG Intime India పోర్టల్: IPO అలాట్‌మెంట్ సెక్షన్‌లోకి వెళ్లి కంపెనీ పేరు ఎంచుకుని, Application Number/Demat Account Number/PAN ద్వారా వివరాలు నమోదు చేసి 'Submit' చేస్తే స్టేటస్ కనిపిస్తుంది.
వివరాలు
గ్రే మార్కెట్ ప్రీమియం, లిస్టింగ్ అంచనాలు
టెన్నెకో క్లిన్ ఎయిర్ IPO కి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) కూడా పెరుగుతోంది. తాజా GMP ₹122 గా ఉంది. దీంతో లిస్టింగ్ ధర పైబాండ్ (₹397) దగ్గర సుమారు ₹519 వరకు ఉండొచ్చని మార్కెట్ అంచనా. అంటే లిస్టింగ్ గెయిన్స్ సుమారు 31% వరకు ఉండొచ్చు. అనలిస్టులు చెబుతున్న ప్రకారం కంపెనీ వాల్యూయేషన్ సరైన స్థాయిలో ఉంది. భారత్‌లో ఆటో టెక్నాలజీ, ఎమిషన్-కంట్రోల్ రంగాల్లో దీర్ఘకాల వృద్ధికి టెన్నెకో క్లిన్ ఎయిర్ మంచి పొజిషన్‌లో ఉందని అభిప్రాయపడుతున్నారు.