రూ.6వేల కోట్ల జీతాలను వాపస్ చేయనున్న టెస్లా డైరెక్టర్లు
ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగంలో టెస్లా కంపెనీ ఎన్నో సంచనాలను సృష్టించింది. ప్రస్తుతం టెస్లా కంపెనీలో డైరక్టర్లు పొందుతున్న జీతాలు, అలవెన్సులపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్‌తో పాటు పలువురు డైరక్టర్లు భారీ వేతనాలను పొందుతున్నారని షేర్ హోల్డర్ల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో షేర్ హోల్డర్లు ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కంపెనీ నిధులను ఎలాన్ మస్క్ తన విలాసాల కోసం వాడుకుంటున్నారని షేర్ హోల్డర్లు ఆరోపించారు. ఈ కేసులో ఎలాన్ మస్క్ న్యాయ పోరాటం చేస్తున్నారు.
ఎలాన్ మస్క్ తనకు తానే భారీ ప్యాకేజీని ప్రకటించుకున్నాడు!
2017 నుంచి 2020 మధ్యలో తమకు కేటాయించుకున్న నిధులను దాదాపుగా రూ.6 వేల కోట్లను కంపెనీ ఖాతాలో జమచేస్తామని తెలిపారు. వీరిలో ఎలాన్ మస్క్ సోదరుడు కింబాల్ మస్క్ కూడా ఉన్నారు. మరోవైపు అమెరికాలోని టెక్సాస్‌లో విలాసవంతమైన అద్దాల భవనాన్ని నిర్మించేందుకు ఎలాన్ మాస్క్ ప్రయత్నించడాని కంపెనీ షేర్ హోల్డర్లలో ఒకరైన రిచర్డ్ టార్నెట్టా ఆరోపించారు. 2018-2019 ఏడాదికి గానూ ఎలాన్ మస్క్ కనీవినీ ఎరగని రీతిలో కాంపెన్సేషన్ పొందారని, సీఈవో హోదాలతో తనకు తాను ఈ భారీ స్థాయి ప్యాకేజీ ప్రకటించుకున్నారని ఇది మానవ చరిత్రలోనే అతి పెద్ద ప్యాకేజీ అని ఆరోపించారు. ఈ విషయంపై ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోందని రిచర్డ్ తెలిపారు.