LOADING...
Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి
టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి

Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

విద్యుత్తు వాహనాల తయారీ రంగంలో ప్రపంచ దిగ్గజం టెస్లా భారతదేశంలో విద్యుత్తు కార్ల తయారీపై ఆసక్తి చూపడం లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌.డి. కుమారస్వామి వెల్లడించారు. దేశీయంగా కేవలం షోరూమ్‌లు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే టెస్లా ముందుకొస్తోందని పేర్కొన్నారు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్తు వాహనాల తయారీ ప్రోత్సాహక పథకానికి సంబంధించి మార్గదర్శకాలను వెల్లడించారు. ఈ సందర్భంగా టెస్లా వ్యవహారంపై స్పందించారు. టెస్లా ఇప్పటివరకు తయారీపై ఏ చిన్న ఆసక్తి చూపలేదు.

Details

టెస్లా ప్రతినిధులు హాజరు కాలేదు

మొదటి రౌండ్‌ చర్చలకు మాత్రమే హాజరయ్యారు. తర్వాత జరిగిన రెండో, మూడో రౌండ్‌ సమావేశాలకు టెస్లా ప్రతినిధులు హాజరుకాలేదని కుమారస్వామి వివరించారు. గతేడాది ఏప్రిల్‌లో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ భారత్ పర్యటనకు రానున్నారని భావించారు. అయితే కంపెనీ పనుల కారణంగా ఆ పర్యటన రద్దు అయింది. ట్రంప్ విమర్శలు - మస్క్‌పై అసంతృప్తి ఈ ఏడాది ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. ప్రతి దేశం అమెరికాను వాడుకోవాలని చూస్తోంది. సుంకాల ద్వారా లాభపడాలని చూస్తున్నారు. మస్క్‌ తన కార్లను భారత్‌లో అమ్మాలనుకుంటున్నారు.

Details

అమెరికాలో దృష్టిలో అన్యాయం

అది ఆయనకి సరైనదేమో కానీ, అమెరికా దృష్టిలో మాత్రం అన్యాయమని ట్రంప్‌ విమర్శించారు. ఇక తన ప్రధానిగా ఉన్న సమయంలో మోదీతో భేటీ సందర్భంగా ఈ అంశాలను ప్రస్తావించినట్లు ట్రంప్ గుర్తుచేశారు. విద్యుత్తు వాహనాలపై అధిక సుంకాల సమస్యను చర్చించినట్లు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, త్వరితగతిన వాణిజ్య ఒప్పందానికి రెండు దేశాలు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. యాపిల్‌పై కూడా ట్రంప్ అసంతృప్తి భారతదేశంలో తయారవుతున్న ఐఫోన్లపై ట్రంప్‌ అసహనం వ్యక్తం చేశారు. భారత్‌లో తయారైన ఫోన్లు అమెరికాలో అమ్మాలంటే 25 శాతం అదనపు సుంకం తప్పదని యాపిల్ సంస్థకు స్పష్టంగా తెలిపారు.