Page Loader
Tesla Shares: ట్రంప్‌తో మస్క్‌ కటీఫ్‌.. 14% పడిపోయిన టెస్లా షేర్లు.. రూ.13 లక్షల కోట్ల నష్టం
ట్రంప్‌తో మస్క్‌ కటీఫ్‌.. 14% పడిపోయిన టెస్లా షేర్లు.. రూ.13 లక్షల కోట్ల నష్టం

Tesla Shares: ట్రంప్‌తో మస్క్‌ కటీఫ్‌.. 14% పడిపోయిన టెస్లా షేర్లు.. రూ.13 లక్షల కోట్ల నష్టం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌,ప్రపంచ కుబేరుడు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ మధ్య సంబంధాలు తీవ్రమైన విభేదాలకు దారి తీశాయి. ఇటీవల ట్రంప్ నేతృత్వంలోని డోజ్‌ శాఖ నుంచి మస్క్‌ తప్పుకున్న అనంతరం ఆయనపై బహిరంగంగా సంచలన ఆరోపణలు చేశారు. అదే సమయంలో ట్రంప్‌ కూడా మస్క్‌కు ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామాలు మస్క్‌ నేతృత్వంలోని టెస్లా కంపెనీపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఫలితంగా సంస్థ షేర్ల విలువ కుప్పకూలింది. ఈ పతనంతో సుమారుగా 152 బిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.13 లక్షల కోట్ల మేర టెస్లా సంపద గల్లంతైంది.

వివరాలు 

మస్క్ వ్యాపారాలపై ప్రభుత్వ ఒప్పందాల రద్దు

మస్క్-ట్రంప్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల ఫలితంగా గురువారం రోజు ట్రేడింగ్‌లో టెస్లా షేర్లు ఏకంగా 14 శాతం మేర క్షీణించాయి. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ 1 ట్రిలియన్‌ డాలర్ల స్థాయిని కోల్పోయి 916 బిలియన్‌ డాలర్లకు చేరింది. టెస్లా చరిత్రలో ఒకే రోజులో ఇంత పెద్ద మొత్తంలో కంపెనీ విలువ తగ్గిన సంఘటన ఇదే తొలిసారి కావడం విశేషం. 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన మద్దతు లేకుంటే ట్రంప్‌,రిపబ్లికన్‌ పార్టీకి ఓటమి తప్పదని మస్క్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా,ట్రంప్‌కు సెక్స్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలపై ట్రంప్‌ తీవ్రంగా స్పందిస్తూ,మస్క్ వ్యాపారాలపై ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేస్తానని హెచ్చరించారు.

వివరాలు 

ప్రజలందరిపై విద్యుత్‌ వాహనాల కొనుగోలుకు ఒత్తిడ

ట్రంప్‌ సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తూ, ''ఎలాన్ మస్క్ అంతగా ప్రభావవంతమైన వ్యక్తి కాదు. ప్రజలందరిపై విద్యుత్‌ వాహనాల కొనుగోలుకు ఒత్తిడి తేవాలని చూస్తున్నారు. నేను ఆ విషయం అంగీకరించలేదు. నేను ఆయనను అక్కర్లేదు అన్నాను. అందుకే ఇపుడు ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారు,'' అని పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

14% పడిపోయిన టెస్లా షేర్లు