LOADING...
TikTok: టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతుంది.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతుంది.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

TikTok: టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతుంది.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2025
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ షార్ట్ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ (TikTok) మళ్లీ భారత్‌లో అందుబాటులోకి వస్తోందన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, టిక్‌టాక్‌పై నిషేధం ఇప్పటికీ కొనసాగుతోందని స్పష్టం చేశాయి. 'టిక్‌టాక్‌ను అన్‌బ్లాక్‌ చేసేలా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలన్నీ పూర్తిగా అవాస్తవం, అవన్ని తప్పుదారి పట్టించే వార్తలే అని సదరు వర్గాలు వెల్లడించాయి. ఈ వెబ్‌సైట్‌ను ఇప్పటికీ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల బ్లాక్‌లిస్ట్‌లోనే ఉంచామని స్పష్టం చేశాయి. అయితే కొంతమంది యూజర్లకు ఇది ఎలా ఓపెన్‌ అవుతోందన్న అంశంపై స్పష్టత లేదని తెలియజేశాయి.

Details

ప్రచారంలో ఎలాంటి నిజం లేదు

2020లో భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడంతో భద్రతా కారణాల రీత్యా టిక్‌టాక్‌ సహా అనేక చైనా యాప్‌లపై భారత్‌ నిషేధం విధించింది. అయినా ఇటీవల కొంతమంది యూజర్లు తమకు టిక్‌టాక్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతోందని పేర్కొన్నారు. కానీ, వారు లాగిన్‌ కావడం, వీడియోలు అప్‌లోడ్‌ చేయడం సాధ్యమవ్వలేదని తెలిపారు. అదే సమయంలో ఈ యాప్‌ ఇంకా యాప్‌ స్టోర్స్‌లో అందుబాటులోకి రాలేదు. భారత్-చైనా మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో టిక్‌టాక్‌ తిరిగి వచ్చిందన్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేంద్రం స్పష్టత ఇచ్చినట్లు తేలింది.

Details

59 యాప్ లు నిషేదం

2020 జూన్‌లో భారత్‌ 59 యాప్‌లను నిషేధించింది. అదే ఏడాది సెప్టెంబర్‌లో మరో 118 చైనా యాప్‌లపై కూడా నిషేధం విధించింది. గల్వాన్‌లో జరిగిన ఘర్షణల తర్వాత చైనా వైఖరిపై అనుమానాలు వ్యక్తమవ్వగా, భారతీయుల సమాచార భద్రత, గోప్యత, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగే ప్రమాదం ఉందన్న కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. టిక్‌టాక్‌తో పాటు హెలో, పబ్‌జీ, షేరిట్‌, యూసీ బ్రౌజర్‌, బైడు మ్యాప్‌, క్లాష్ ఆఫ్‌ కింగ్స్‌ వంటి యాప్‌లను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు.