
unemployment data: దేశంలో తొలిసారిగా నెలవారీ ఉద్యోగ గణాంకాలు.. ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1శాతం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా దేశవ్యాప్తంగా నెలవారీ ఉద్యోగ గణాంకాలను విడుదల చేసింది.
2025 ఏప్రిల్‌కు సంబంధించిన ఈ గణాంకాల ప్రకారం, దేశంలోని నిరుద్యోగ రేటు 5.1 శాతంగా నమోదైంది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఈ సమాచారం వెల్లడించింది.
ఈ గణాంకాలను పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) కింద కరెంట్ వీక్లీ స్టేటస్ (CWS) ప్రమాణాలతో సేకరించారు. ఇప్పటివరకు PLFS సర్వేలు వార్షిక, త్రైమాసిక స్థాయిలో మాత్రమే నిర్వహిస్తున్నాయి.
కానీ ఇప్పుడు నెలవారీ గణాంకాలను విడుదల చేస్తుండటం ఉపాధి పరిస్థితులపై సమయానుకూలంగా అవగాహన అందించడమే లక్ష్యంగా ఉంది.
Details
గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ హాజరు ఎక్కువ
ఏప్రిల్ 2025కు గాను 15 ఏళ్లు, అంతకంటే పై వయస్సు గల వారి లోగడ నిరుద్యోగ రేటు 5.1% గా ఉంది. పురుషులలో ఇది 5.2శాతం, మహిళలలో 5.0శాతంగా నమోదైంది.
లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (LFPR) దేశవ్యాప్తంగా 55.6శాతంగా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో 58శాతం, పట్టణాల్లో 50.7శాతం
పురుషుల LFPR: గ్రామీణ ప్రాంతాల్లో 79శాతం, పట్టణాల్లో 75.3శాతం
మహిళల LFPR: గ్రామీణ ప్రాంతాల్లో 38.2శాతం, పట్టణాల్లో కేవలం 23.5శాతం
Details
ఉపాధి పొందినవారి శాతం - వర్కర్ పాపులేషన్ రేషియో (WPR)
మొత్తం దేశవ్యాప్తంగా WPR 52.8శాతంగా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో 55.4%, పట్టణాల్లో 47.4%
గ్రామీణ మహిళల WPR: 36.8%
పట్టణ మహిళల WPR: 23.5%
మొత్తం మహిళల ఉపాధి రేటు: 32.5%
అంతర్జాతీయ ప్రమాణాల వైపు అడుగు
ఈ గణాంకాలను ప్రతి నెల 45 రోజుల వ్యవధిలో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విధానం అంతర్జాతీయ కార్మిక గణాంక ప్రమాణాలకు దేశాన్ని మరింత దగ్గర చేస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
ఇకపై దేశంలోని ఉపాధి పరిస్థితులపై మరింత వేగంగా, నిశితంగా విశ్లేషణలు చేయడంలో ఈ నెలవారీ గణాంకాలు కీలక పాత్ర పోషించనున్నాయి.
Details
CMIE గణాంకాలతో తేడా
ప్రైవేట్ పరిశోధనా సంస్థ CMIE విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్‌లో దేశంలో నిరుద్యోగ రేటు 7.73శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
ఇది ప్రభుత్వ గణాంకాలతో పోల్చితే తక్కువగా ఉంది.
అధికారికంగా పట్టణాల్లో నిరుద్యోగ రేటు 6.5శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 4.5శాతంగా నమోదైనట్లు వెల్లడించారు.