Page Loader
Gold Rates: తులం బంగారం ధర రూ. లక్ష దాటింది.. శ్రావణ మాసంలో మహిళలకు బ్యాడ్ న్యూస్!
తులం బంగారం ధర దాటింది.. శ్రావణ మాసంలో మహిళలకు బ్యాడ్ న్యూస్!

Gold Rates: తులం బంగారం ధర రూ. లక్ష దాటింది.. శ్రావణ మాసంలో మహిళలకు బ్యాడ్ న్యూస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 23, 2025
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌కు ముందు పసిడి భగ్గుమంటోంది. ముఖ్యంగా శ్రావణమాసం ప్రారంభం కావడం, వరుస పండుగల నేపథ్యంలో ప్రజలు బంగారం కొనుగోలుకు సిద్ధమవుతుండగా, బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరిగి లక్ష రూపాయల మార్క్‌ను దాటేశాయి. గతంలో కొంత కాలం ధరలు స్వల్పంగా తగ్గినా, ఇప్పుడు మళ్లీ గోల్డ్ రేటు పరుగులు పెట్టింది. జులై 23నాటికి పసిడి ధరలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకోవడం గమనార్హం. తాజాగా పెరిగిన బంగారం ధరలు సాధారణ ప్రజానికం మధ్య ఆందోళనకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో బంగారం ధరలు కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి.

Details

ఈరోజు బంగారం ధరలు - అన్ని క్యారెట్ల వారీగా

24 క్యారెట్ల బంగారం - 1 గ్రాము ధర: రూ. 10,130 22 క్యారెట్ల బంగారం - 1 గ్రాము ధర: రూ. 9,286 18 క్యారెట్ల బంగారం - 1 గ్రాము ధర: రూ. 7,598 ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఢిల్లీ 24 క్యారెట్లు - రూ. 1,01,450 22 క్యారెట్లు - రూ. 93,010 ముంబై 24 క్యారెట్లు - రూ. 1,01,300 22 క్యారెట్లు - ₹92,860 చెన్నై 24 క్యారెట్లు - రూ. 1,01,300 22 క్యారెట్లు - ₹92,860

Details

బెంగళూరు

24 క్యారెట్లు - రూ. 1,01,300 22 క్యారెట్లు - ₹92,860 హైదరాబాద్ 24 క్యారెట్లు - రూ. 1,01,300 22 క్యారెట్లు - రూ. 92,860 విజయవాడ & విశాఖపట్నం 24 క్యారెట్లు - రూ. 1,01,300 22 క్యారెట్లు - రూ. 92,860 ఈ ధరల పెరుగుదల వెనుక పలు అంతర్జాతీయ, ఆర్థిక కారణాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే పండుగల సీజన్‌ను పురస్కరించుకొని బంగారం కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ప్రజలకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పడంలో సందేహం లేదు.