Gold Rates: ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.89 వేల దిశగా పసిడి పరుగులు!
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి.
గత రెండు మూడు నెలల్లోనే బంగారం ధరలు దాదాపు 10% పెరిగాయి.
ఈ నేపథ్యంలో ప్రతిరోజూ పసిడి రేట్లు ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తున్నాయి. అయితే, శుక్రవారం బంగారం పెరుగుదల కాస్త నెమ్మదించిందని చెప్పుకోవచ్చు.
తాజాగా 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ. 100 మాత్రమే పెరిగింది. వెండి ధరలు కేజీకి రూ.100 తగ్గాయి.
Details
వెండి ధరల్లో కాస్త తగ్గుదల
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.80,800 వద్ద ట్రేడ్ అవుతోంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.100 పెరిగి రూ.88,100కు చేరుకుంది.
18 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.66,100గా ఉంది.
వెండి ధరల్లో మాత్రం కాస్త తగ్గుదల కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కేజీ వెండి ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.1,07,900 వద్ద ట్రేడ్ అవుతోంది.
బంగారం ధరల విపరీతమైన పెరుగుదల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు పసిడి కొనుగోలు చేయాలనే ఆలోచనకు దూరంగా ఉంటున్నారు. ఇక ఉన్నత వర్గాల వారు కూడా పెట్టుబడులకు వెనుకాడుతున్నారు.