Page Loader
చంద్రయాన్ -3 ప్రయోగంలో భాగమైన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇవే..
ఇస్రోకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల చేయుత

చంద్రయాన్ -3 ప్రయోగంలో భాగమైన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇవే..

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 24, 2023
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

చంద్రయాన్-3 విజయంతో చందమామపై భారత్ ముద్ర వేసింది. కేవలం రూ.615 కోట్ల అతి తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ చేపట్టిన ఇస్రో ఘన విజయం సాధించింది. దీంతో అంతరిక్ష వాణిజ్యంలో అగ్ర దేశాల సరసన సగర్వంగా నిలిచింది భారత్‌. ఇస్రో కీలక విజయంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలూ భాగమయ్యాయి. మిషన్ కు అవసరమైన ముడిసరుకు, ఉపకరణాలు, విడిభాగాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాయి. టాటా ఎలక్సీ : అంతరిక్ష నౌక, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ : చంద్రయాన్‌-3 ల్యాండర్‌ తయారీ ఎల్‌అండ్‌టీ : లాంచ్‌ ప్యాడ్‌, మౌలిక వసతులు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ : ల్యాండర్‌ అభివృద్ధి, పరికరాల అందజేసింది. ఎల్‌అండ్‌టీ సహకారంతో నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబ్‌కు కీలక స్పేర్ పార్ట్స్

details

శాటిలైట్‌ థ్రస్టర్స్‌ను సమకూర్చిన గోద్రేజ్‌ అండ్‌ బాయ్స్‌

సెంటమ్‌ ఎలక్ట్రానిక్స్‌ : స్పేస్‌ అప్లికేషన్లకు ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్ డిజైన్‌ చేసి, అభివృద్ధి చేసింది. వాటి తయారీలోనూ సహకరించింది. కేరళ స్టేట్‌ ఎలక్ట్రానిక్స్‌ డెవలప్‌మెంట్‌ కార్ప్‌: ఎలక్ట్రానిక్‌ పవర్‌ మాడ్యూల్స్, టెస్ట్‌ ఎవల్యూషన్‌ సిస్టమ్‌ డెవలప్ మెంట్ హిమ్‌సన్‌ ఇండస్ట్రియల్‌ సెరామిక్‌ : 3 వేల సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ కరగని సిరామిక్‌ విడి భాగాలు అందజేత. స్వ్కిబ్స్‌ను ఈ కంపెనీయే సమకూర్చింది. వాల్‌చంద్‌ ఇండస్ట్రీస్‌ : మిషన్‌ కాంపోనెంట్స్‌ మానుఫ్యాక్చరింగ్ గోద్రేజ్‌ అండ్‌ బాయ్స్‌ : చంద్రయాన్‌, మంగళయాన్‌ మిషన్లకు లిక్విడ్‌ ప్రొపెల్షన్‌ ఇంజిన్లు, శాటిలైట్‌ థ్రస్టర్స్‌, కంట్రోల్‌ మాడ్యూల్‌ పరికరాల సమర్పణ సుందరం ఫాజనర్స్‌ : ఇస్రోకు దీర్ఘకాలంగా ఫాజనర్స్‌ సరఫరా

details

వికాస్‌ ఇంజిన్లకు అందించిన అనంత్‌ టెక్నాలజీస్‌ 

అనంత్‌ టెక్నాలజీస్‌ : ఇస్రో లాంచ్‌ వెహికల్స్‌, శాటిలైట్లు, అంతరిక్ష నౌక పేలోడ్లు లాంటి వాటికి ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌ సబ్‌ సిస్టమ్స్‌ను తయారు చేసి అందించింది. చంద్రయాన్‌- 3 ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా ఇంటర్‌ఫేస్‌ ప్యాకేజెస్‌, పవర్‌ స్విచింగ్‌ మాడ్యూల్స్‌, రిలే అండ్‌ బ్యాలెన్సింగ్‌ యూనిట్లు, టెలిమెట్రీ, టెలీకమాండ్‌ లాంటి శాటిలైట్‌ సిస్టమ్స్‌, డీసీ టూ డీసీ కన్వర్టర్లను సరఫరా చేసింది. ఎంటార్‌ టెక్నాలజీస్‌ : చంద్రయాన్‌-3 ప్రాజెక్టుకు వికాస్‌ ఇంజిన్లకు, క్రయోజనిక్‌ ఇంజిన్‌ సబ్‌ సిస్టమ్స్‌ అందజేసింది.

details

కీలకమైన ప్రగ్యాన్‌ రోవర్‌కు నావిగేషన్‌ సాఫ్ట్‌వేర్‌ సమర్పించిన ఓమ్నిప్రెజెంట్‌ రోబో టెక్నాలజీస్‌

భారత్‌ ఫోర్జ్‌ : మోనోకోక్‌ హల్‌ మల్టీ రోల్‌ మైన్‌ ప్రొటెక్టెడ్‌ ఆర్మోర్డ్‌ వెహికల్‌ను రూపొందించింది. మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్ : LVM 3, 4కు అవసరమైన కీలక, వ్యూహాత్మక మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఓమ్నిప్రెజెంట్‌ రోబో టెక్నాలజీస్‌ : కీలకమైన ప్రగ్యాన్‌ రోవర్‌కు శక్తిమంత(పవర్డ్) నావిగేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను అందజేసింది. బీహెచ్ఈఎల్(బెల్) : చంద్రయాన్‌- 3 ప్రాజెక్ట్ కోసం 100వ బ్యాటరీని సమకూర్చింది. పరాస్‌ డిఫెన్స్‌ : స్పేస్‌క్రాఫ్ట్‌కు నావిగేషన్‌ వ్యవస్థ సరఫరా చేసింది. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ : చంద్రయాన్‌-3కి సంబంధించిన పేలోడ్స్‌ను తయారు చేసింది.అంతరిక్ష వాణిజ్యంలో భారత్ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుంది. ఇస్రో భాగస్వామిగా తామెంతో సంతోషిస్తునట్లు ఎల్‌అండ్‌టీ సీఈఓ తెలిపారు.