Page Loader
New Rules From October:క్రెడిట్ కార్డ్,డెబిట్ కార్డు రూల్స్.. ఆదాయపు పన్ను, పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లలో అక్టోబర్‌ నుండి రానున్న మార్పులివే.. 
రేపటి నుంచే కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతాయి

New Rules From October:క్రెడిట్ కార్డ్,డెబిట్ కార్డు రూల్స్.. ఆదాయపు పన్ను, పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లలో అక్టోబర్‌ నుండి రానున్న మార్పులివే.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 30, 2024
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్టోబర్‌ నెల ప్రవేశించడంతో, కొన్ని ముఖ్యమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇందులో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ డెబిట్‌ కార్డ్‌ మార్పులు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ నిబంధనలలో మార్పులు ఉన్నాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పోస్టాఫీస్‌ స్మాల్‌ సేవింగ్‌ అకౌంట్‌, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు అక్టోబర్‌ 1 నుంచి మారవచ్చు. అక్టోబర్-డిసెంబర్‌ త్రైమాసికానికి వడ్డీ రేట్లను కేంద్రం సవరించనున్నది.

వివరాలు 

ఐసీఐసీఐ బ్యాంక్‌ డెబిట్‌ కార్డు 

ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank) డెబిట్‌ కార్డుకు అక్టోబర్‌ 1 నుంచి కొన్ని ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి. బ్యాంక్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించిన విధంగా, మునుపటి క్యాలెండర్‌ త్రైమాసికంలో కార్డుతో రూ.10,000 వరకు ఖర్చు చేస్తే, ప్రస్తుత త్రైమాసికంలో రెండు కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ పొందవచ్చని పేర్కొంది. అంటే అక్టోబర్-డిసెంబర్‌ త్రైమాసికంలో లాంజ్‌ యాక్సెస్‌ పొందడానికి జులై-సెప్టెంబర్‌ మధ్య రూ.10,000 ఖర్చు పెట్టాలి.

వివరాలు 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank)క్రెడిట్‌ కార్డు నిబంధనల్లో మార్పులు వచ్చాయి. ఆపిల్ ఉత్పత్తుల కొనుగోళ్ళపై పరిమితులు విధించబడ్డాయి. అక్టోబర్‌ 1 నుంచి స్మార్ట్‌బై ప్లాట్‌ఫామ్‌ ద్వారా త్రైమాసికంలో కేవలం ఒక యాపిల్‌ ఉత్పత్తి కొనుగోలు మీదే రివార్డు పాయింట్లను రిడీమ్‌ చేసుకునే అవకాశం కల్పించనుంది. ఇక, ప్రతి త్రైమాసికంలో తనిష్క్‌ వోచర్‌ కోసం గరిష్ఠంగా 50,000రివార్డ్‌ పాయింట్లను మాత్రమే రిడీమ్‌ చేసుకోవచ్చు. ఇన్ఫినియా, ఇన్ఫినియా మెటల్‌ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు ఈ మార్పులు వర్తిస్తాయి. ఆధార్‌ కార్డ్ వినియోగం ఇప్పటివరకు పాన్‌ కార్డ్‌ దరఖాస్తు లేదా పన్ను రిటర్నులు ఫైల్‌ చేసే సమయంలో,ఆధార్‌ కార్డు నంబర్‌ లేదా ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ ఏదో ఒకటి ఉండాలి. ఇకపై,కేవలం ఆధార్‌ నంబర్‌నే వినియోగించాలి.

వివరాలు 

ఎస్‌టీటీ ఛార్జీలు 

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్‌ (F&O) ట్రేడింగ్‌లో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించేందుకు, కేంద్రం పన్ను రేట్లను సవరించింది. ప్రస్తుతం ఒక సెక్యూరిటీ ఆప్షన్‌ కాంట్రాక్ట్‌ను విక్రయించినప్పుడు ఆప్షన్‌ ప్రీమియంపై 0.0625% ఎస్‌టీటీ విధించబడుతుంది, దీనిని 0.1%కి పెంచనున్నారు. ఫ్యూచర్స్‌ విభాగంలో, ప్రస్తుత ఎస్‌టీటీ 0.0125% కాగా, దీనిని 0.02%కి పెంచబడనుంది. అక్టోబర్‌ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. బైబ్యాక్‌ ప్రక్రియలో షేర్లు అమ్మినప్పుడు లభించే మొత్తం పైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

వివరాలు 

వివాద్‌ సే విశ్వాస్ 2.0 

ఆదాయపు పన్ను వివాదాల పరిష్కారానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు, 2024 అక్టోబర్‌ 1 నుంచి వివాద్‌ సే విశ్వాస్‌ పథకం అమల్లోకి రానుంది. ఈ మేరకు నిబంధనలు మరియు ఫారంలను ఆదాయపు పన్ను విభాగం నోటిఫై చేసింది.

వివరాలు 

బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల లావాదేవీ రుసుములు 

ఈక్విటీ (క్యాష్‌), డెరివేటివ్స్‌ (ఫ్యూచర్స్, ఆప్షన్స్‌) విభాగంలో లావాదేవీ రుసుములను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు సవరించాయి. అక్టోబర్‌ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. సెన్సెక్స్, బ్యాంకెక్స్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్టులకు రూ.1 కోటి ప్రీమియమ్‌ టర్నోవర్‌ పై లావాదేవీ రుసుము రూ.3,250గా మారింది. ఎన్‌ఎస్‌ఈలో క్యాష్‌ మార్కెట్‌ లావాదేవీ రుసుము రూ.లక్ష ట్రేడింగ్‌ విలువకు రూ.2.97గా ఉంది. ఈక్విటీ ఫ్యూచర్స్‌ రుసుము రూ.1.73గా, ఈక్విటీ ఆప్షన్స్‌కు రూ.లక్ష ప్రీమియమ్‌ విలువకు రూ.35.03గా ఉంది.