Page Loader
TikTok: అమెరికాలో టిక్‌టాక్ నిషేధం?.. ఎలాన్ చేతికి అప్పగించేందుకు చైనా వ్యూహం! 
అమెరికాలో టిక్‌టాక్ నిషేధం?.. ఎలాన్ చేతికి అప్పగించేందుకు చైనా వ్యూహం!

TikTok: అమెరికాలో టిక్‌టాక్ నిషేధం?.. ఎలాన్ చేతికి అప్పగించేందుకు చైనా వ్యూహం! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 14, 2025
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ అమెరికాలో నిషేధానికి గురయ్యే ప్రమాదం ఎదుర్కొంటోంది. దీనికి పరిష్కారం కోసం చైనా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో టిక్‌టాక్‌ కార్యకలాపాలను ప్రపంచ కుబేరుడు, 'ఎక్స్‌' అధినేత ఎలాన్ మస్క్‌కు విక్రయించేందుకు చైనా యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం చైనీస్‌ అధికారిక వర్గాలను ఉటంకిస్తూ 'బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌' వెల్లడించింది. 2017లో ప్రారంభమైన టిక్‌టాక్‌ ఇప్పటికే భారత్‌ సహా పలు దేశాల్లో నిషేధానికి గురైంది.

Details

సుప్రీం కోర్టులో అప్పీల్ చేసేందుకు సిద్ధం!

అలాగే అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు కూడా ఈ యాప్ వినియోగంపై ఆంక్షలు విధించాయి. ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇందులో చైనా యాజమాన్యం టిక్‌టాక్‌ను వదులుకోకపోతే యాప్‌పై పూర్తి నిషేధం విధించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ పరిస్థితుల నడుమ, టిక్‌టాక్‌ యాజమాన్యం తమ హక్కుల కోసం అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.