Page Loader
భారత్‌లో మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్ కుక్; కస్టమర్లకు స్వాగతం 
భారత్‌లో మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్ కుక్; కస్టమర్లకు స్వాగతం

భారత్‌లో మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్ కుక్; కస్టమర్లకు స్వాగతం 

వ్రాసిన వారు Stalin
Apr 18, 2023
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో మొట్టమొదటి యాపిల్ స్టోర్‌ను సీఈఓ టిమ్ కుక్ మంగళవారం ప్రారంభించారు. తొలి రిటైల్‌ స్టోర్‌ను ముంబైలో ఏర్పాటు చేశారు. యాపిల్ స్టోర్‌ ప్రారంభం అనంతరం తలుపులు తెరిచిన టిమ్ కుక్, స్వయంగా కస్టమర్లకు స్వాగతం పలికారు. దుకాణానికి వచ్చిన కస్టమర్లను పలకరిస్తూ కొందరితో సెల్ఫీలు కూడా దిగారు. ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడానికి భారతదేశం అంతటా యాపిల్ అభిమానులు ముంబైకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. యాపిల్ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా సంగీతం, జానపద నృత్య ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశారు. ముంబైలోని చాలా కాస్లీ ఏరియాలో స్టోర్‌ను ఏర్పాటుచేశారు. దీని డిజైనింగ్ కూడా ఆకర్షణీయంగా ఉంది.

యాపిల్

దిల్లీలో గురువారం రెండో స్టోర్ ప్రారంభం

ఇదిలా ఉంటే, భారత్ రెండో యాపిల్ స్టోర్‌ను దిల్లీలో ప్రారంభించనున్నారు. రెండో స్టోర్‌ను గురువారం ప్రారంభించేందుకు ఇప్పటికే కుక్ ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇప్పటి వరకు యాపిల్ ఉత్పత్తులు భారతదేశంలో కేవలం ఆన్‌లైన్‌, రీసెల్లర్‌ పద్ధతిలోనే అందుబాటులో ఉన్నాయి. దిల్లీ, ముంబై స్టోర్ల ప్రారంభంతో రిటైల్‌గా కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలోని రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అయిన భారతదేశంలో ఆపిల్ తన రిటైల్ మార్కెట్‌ను విస్తరించుకోవడానికి ఈ స్టోర్లు ఉపయోగపడుతాయని టిమ్ కుక్ అభిప్రాయపడుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా యాపిల్ పాత మోడల్ కంప్యూటర్‌తో కుక్‌ను ఆశ్చర్యపరిచిన కస్టమర్