LOADING...
Gold & Silver Price Update: పసిడి కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గుతున్న ధరలు..
పసిడి కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్..తగ్గుతున్న ధరలు..

Gold & Silver Price Update: పసిడి కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గుతున్న ధరలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2026
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం అంటే ఇష్టపడని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తికాదు. భారత్‌లో నూటికి 90 శాతం శుభకార్యాలలో బంగారం తప్పని సరి. గత సంవత్సరం లక్ష రూపాయిలకంటే తక్కువ ధరలో ఉన్న బంగారం, ఊహించని రీతిలో పెరిగింది. ఈ క్రమంలో, ఈ రోజు స్వచ్ఛమైన బంగారం ధర సుమారు రూ.1,30,000 వద్ద ట్రేడ్ అవుతోంది. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరల వల్ల ఇబ్బందిపడుతున్న వారికి, కొంత ఊరట కలిగే వార్త ఇది. వారం రోజుల ముందు వరకు పరుగులు పెట్టిన బంగారం ధరలు.. రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటను కలిగిస్తోంది.

వివరాలు 

ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి:

10 గ్రాముల 24 క్యారెట్లు: రూ.1,37,990 10 గ్రాముల 22 క్యారెట్లు: రూ.1,26,500 10 గ్రాముల 18 క్యారెట్లు: రూ.1,03,500 ఈ రోజు (శుక్రవారం) బంగారం ధరలలో ప్రతి కేటగిరీపై సుమారు రూ.10 తగ్గుదల కనిపించింది. వెండి ధరలు: పెట్టుబడిదారులకు వెండి పెట్టే అవకాశాలు ఇంకా మంచివే అని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే, గత రెండు రోజులుగా వెండి ధరలు కొంచెం తగ్గుదల చూపుతున్నాయి. నిన్న కేజీ వెండి ధర రూ.2,72,000 వద్ద, 100 గ్రాముల వెండి ధర రూ.27,200 వద్ద ట్రేడ్ అయింది. ఈ రోజు (శుక్రవారం)కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.2,71,900 వద్ద,100 గ్రాముల వెండి ధర రూ.10 తగ్గి రూ.27,190 వద్ద ట్రేడ్ అవుతోంది.

వివరాలు 

దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు (24 క్యారెట్లు ఒక గ్రాముకు.. అంచనా) 

హైదరాబాద్ రూ. 13,977 విజయవాడ రూ. 13,977 ఢిల్లీ రూ. 13,977 ముంబై రూ. 13,995 వడోదర రూ. 13,995 కోల్‌కతా రూ. 13,890 చెన్నై రూ. 14,000 బెంగళూరు రూ. 13,880 కేరళ రూ. 14,000 పూణే రూ. 13,900 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

Advertisement