LOADING...
Vegetable Prices: సామాన్యులకు ఊరట.. తగ్గుముఖం పట్టిన కూరగాయల ధరలు
సామాన్యులకు ఊరట.. తగ్గుముఖం పట్టిన కూరగాయల ధరలు

Vegetable Prices: సామాన్యులకు ఊరట.. తగ్గుముఖం పట్టిన కూరగాయల ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2026
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

నిత్యావసర సరుకుల ధరల భారం నుంచి సామాన్య ప్రజలకు కొంత ఊరట లభిస్తోంది. ముఖ్యంగా కూరగాయల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.రోజువారీ వంటల్లో ఎక్కువగా వినియోగించే టమాట ధరలు భారీగా తగ్గడం వినియోగదారులకు శుభవార్తగా మారింది. గతకొన్ని రోజులుగా టమాట ధరలు నిరంతరం పడిపోతుండటంతో మార్కెట్లలో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు టమాట కేజీ ధర రూ.40 నుంచి రూ.50 వరకు ఉండగా,గత వారం అది రూ.25కి దిగివచ్చింది. ప్రస్తుతం మరోసారి తగ్గి కేజీకి కేవలం రూ.15కే లభిస్తోంది. టమాట ధరల పతనంతో సామాన్య కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే మరోవైపు కాకరకాయ ధరలు స్వల్పంగా పెరగడం గమనార్హం.ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

వివరాలు 

హైదరాబాద్‌లో కూరగాయల ధరలు

మంగళవారం హైదరాబాద్ కూకట్‌పల్లి రైతు మార్కెట్‌లో టమాట కేజీ రూ.17గా నమోదైంది. దొండకాయ రూ.45, చిక్కుడుకాయ రూ.23, గోరుచిక్కుడు రూ.35 ధర పలికాయి. బీట్‌రూట్ కేజీ రూ.15, క్యాప్సికం రూ.43, బెండకాయ రూ.35, వంకాయ రూ.23గా ఉంది. పచ్చిమిర్చి రూ.45, బజ్జీ మిర్చి రూ.35, ఎండుమిర్చి రూ.220గా అమ్ముడవుతోంది. ఇక దోసకాయ కేజీ రూ.19, కీరదోస రూ.18, సొరకాయ రూ.20, ఆలుగడ్డ రూ.17గా ఉన్నాయి. కాకరకాయ రూ.45, బీరకాయ రూ.38, క్యాబేజీ రూ.15 ధరకు లభిస్తోంది. బీన్స్ కేజీ రూ.45, క్యారెట్ రూ.25గా ఉంది. ఉల్లిగడ్డ రూ.20, చామగడ్డ రూ.28, కంద రూ.35, పొట్లకాయ రూ.18గా నమోదయ్యాయి.

వివరాలు 

గుంటూరులో కూరగాయల రేట్లు

గుంటూరులోని ఎన్టీఆర్ రైతు బజార్‌లో టమాట కేజీ రూ.22గా ఉంది. బెండకాయ రూ.20, వంకాయ రూ.25, పచ్చిమిర్చి రూ.37 ధర పలికాయి. కాకరకాయ రూ.30, క్యారెట్ రూ.32గా ఉంది. క్యాబేజీ రూ.23, బీరకాయ రూ.38, దొండకాయ రూ.49గా అమ్ముడవుతోంది. బంగాళదుంప కేజీ రూ.25, ఉల్లిపాయలు రూ.25, దోసకాయ రూ.40గా ఉన్నాయి. పొట్లకాయ రూ.20, చామగడ్డ రూ.23 ధర పలికాయి. బీట్‌రూట్ రూ.25, కీరదోస రూ.30, క్యాప్సికం రూ.55గా నమోదయ్యాయి. ఆకుకూరల్లో గోంగూర, తోటకూర, చుక్కకూర కట్ట రూ.10గా ఉండగా, మెంతికూర రూ.5, కొత్తిమీర రూ.20గా ఉంది.

Advertisement

వివరాలు 

విజయవాడలో కూరగాయల పరిస్థితి

విజయవాడ రైతు మార్కెట్‌లో టమాట కేజీ రూ.19గా ఉంది. వంకాయ రూ.25, బెండకాయ రూ.24, పచ్చిమిర్చి రూ.32 ధర పలికాయి. కాకరకాయ రూ.40, క్యాబేజీ రూ.22గా నమోదైంది. బంగాళదుంప రూ.23, ఉల్లిపాయలు రూ.24గా ఉన్నాయి. ఇక గోరుచిక్కుడు రూ.32, దోసకాయ రూ.40, సొరకాయ కేవలం రూ.10కే లభిస్తోంది. బీరకాయ రూ.24, చామదుంప రూ.26, కీరదోస రూ.30గా విక్రయిస్తున్నారు.

Advertisement