
Top 10 richest people in India: జూలై 2025 నాటికి భారతదేశంలోని టాప్ 10 ధనవంతులు వీరే..?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక పత్రిక "ఫోర్బ్స్" 2025 జూలై నెలకు సంబంధించిన ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ మరోసారి దేశంలోని అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఆయన మొత్తం ఆస్తి 116 బిలియన్ డాలర్లుగా, అంటే సుమారుగా రూ. 9.5 లక్షల కోట్లుగా అంచనా వేసిన ఫోర్బ్స్, అతడిని ఆసియాలోనే అగ్ర ధనవంతుడిగా గుర్తించింది.
వివరాలు
భారతదేశంలో ధనవంతుల స్థానాలు ఎలా ఉన్నాయి?
ఈ జాబితాలో అంబానీ తర్వాతి స్థానాన్ని గౌతమ్ అదానీ ఆక్రమించారు. ఆయన సంపద 67 బిలియన్ డాలర్లుగా నమోదు అయ్యింది. గతంలో మార్కెట్‌లో వచ్చిన ఒడిదొడుకులు ఆయన స్థానం మీద ప్రభావం చూపినా, ప్రస్తుతం ఆయన భారత్‌లో రెండో ధనవంతుడిగా కొనసాగుతున్నారు. అదానీ వ్యాపారాలు మౌలిక సదుపాయాలు,పోర్టులు, విద్యుత్ ఉత్పత్తి వంటి అనేక రంగాల్లో విస్తరించి ఉన్నాయి. తదుపరి మూడో స్థానంలో HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ ఉన్నారు. ఆయన సంపదను ఫోర్బ్స్ 38 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. నాలుగో స్థానాన్ని సావిత్రి జిందాల్, ఆమె కుటుంబ సభ్యులు ఆక్రమించగా, వారి కలిసిన సంపద 37.3 బిలియన్ డాలర్లుగా ఉంది.
వివరాలు
భారతదేశంలో ధనవంతుల స్థానాలు ఎలా ఉన్నాయి?
ఐదో స్థానంలో సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వి నిలిచారు. ఆయన సంపద 26.4 బిలియన్ డాలర్లు. ఆరవ స్థానంలో సీరం ఇన్‌స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా ఉన్నారు,వీరి సంపద 25.1 బిలియన్ డాలర్లుగా నమోదు అయింది. ఏడో స్థానంలో ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార్ మంగళం బిర్లా ఉన్నారు, ఆయన ఆస్తి 22.2 బిలియన్ డాలర్లు. ఎనిమిదవ స్థానాన్ని ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ ఆక్రమించగా, ఆయన సంపద 18.7 బిలియన్ డాలర్లుగా ఉంది.
వివరాలు
డిమార్ట్ అధినేత దమానీ, డిఎల్‌ఎఫ్ చైర్మన్ కుష్‌పాల్ సింగ్ కూడా టాప్ 10లో
తొమ్మిదవ స్థానంలో డిమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని ఉన్నారు. ఆయన ఆస్తిని ఫోర్బ్స్ 18.3 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. పదవ స్థానంలో మాత్రం బిలియనీర్ కుష్‌పాల్ సింగ్ నిలిచారు. డిఎల్‌ఎఫ్ చైర్మన్‌గా కొనసాగుతున్న ఆయన, ఆర్సెలర్ మిట్టల్‌లో భాగస్వామ్యంతో కూడిన వ్యాపారాల ద్వారా సంపదను కూడగట్టారు. ఫోర్బ్స్ జాబితాలో కుష్‌పాల్ సింగ్‌కు ఇది మొదటిసారి చోటు లభించడం విశేషం.