Palace on Wheels: 'ప్యాలెస్ ఆన్ వీల్స్' రైలు ప్రారంభం.. బుకింగ్ ప్రక్రియ, టిక్కెట్ ధరలు తెలుసుకోండి!
చాలామందికి రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం.. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ మన దేశంలోనే ఉంది. ఇక మనదేశంలో ఫైవ్ స్టార్ హోటల్స్ ను మించిన కొన్ని రైళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి 'ప్యాలెస్ ఆన్ వీల్స్'. ఇందులో టికెట్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. రైలు లోపలి భాగం రాచరిక సంస్కృతి కనిపిస్తుంది. ఈ రైలును 1982లో ప్రారంభించారు. ప్యాలెస్ ఆన్ వీల్స్ రాజస్థాన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నడిచే మొదటి లగ్జరీ హెరిటేజ్ రైలు.
8 రోజుల ప్రయాణం
'ప్యాలెస్ ఆన్ వీల్స్' రైలు పింక్ సిటీ జైపూర్, గోల్డెన్ సిటీ జైసల్మేర్, జోధ్‌పూర్, ఉదయపూర్ వంటి ఐకానిక్ రాజస్థానీ నగరాలను కవర్ చేస్తుంది. మొత్తం 8 రోజుల పాటు సాగే ఈ రైలు ప్రయాణం దిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పర్యాటక ప్రాంతాలను ఈ రైలు కవర్ చేస్తుంది. దిల్లీ → జైపూర్ → సవాయి మాధోపూర్ → చిత్తోర్‌గఢ్ → ఉదయపూర్ → జైసల్మేర్ → జోధ్‌పూర్ → భరత్‌పూర్ → ఆగ్రా మీదుగా మొత్తం ఎనిమిది రోజులు ప్రయాణించి చివరికి దిల్లీకి చేరుకుంటుంది. 'ప్యాలెస్ ఆన్ వీల్స్' టిక్కెట్ ధరలు డిమాండ్, ఆక్యుపెన్సీ ఆధారంగా మారుతుంటాయి.
అధికారక వెబ్ సైట్ టికెట్ బుకింగ్
అక్టోబర్ 2024 నుండి మార్చి 2025 వరకు ఈ రైలు సీజన్ ఉండటం వల్ల ధరలు కేటగిరీ ఆధారంగా వేరువేరుగా ఉంటాయి. ఈ రైలులో ప్రయాణించాలంటే సుమారు రూ.3,63,300 టికెట్ ధర ఉండనుంది. 'ప్యాలెస్ ఆన్ వీల్స్' టిక్కెట్‌ను బుక్ చేసుకోవాలనుకుంటే, ప్యాలెస్ ఆన్ వీల్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి [https://www.thepalaceonwheels.org](https://www.thepalaceonwheels.org) 1. వెబ్‌సైట్‌లోకి వెళ్లి టికెట్ బుకింగ్ సెక్షన్‌కి వెళ్లండి. 2. బయలుదేరే తేదీలను ఎంచుకోండి. 3. ప్రయాణికుల వివరాలను పూరించండి. 4. ఇతర వివరాలను సమర్పించి, బుకింగ్ పూర్తిచేయండి.