Page Loader
AskDISHA 2.0: వాయిస్ కమాండ్‌తో ట్రైన్ టికెట్ బుకింగ్.. రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే ఫీచర్!
వాయిస్ కమాండ్‌తో ట్రైన్ టికెట్ బుకింగ్.. రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే ఫీచర్!

AskDISHA 2.0: వాయిస్ కమాండ్‌తో ట్రైన్ టికెట్ బుకింగ్.. రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే ఫీచర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

తరచూ రైల్లో ప్రయాణించే వారు టికెట్ బుకింగ్ లేదా క్యాన్సిలేషన్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు ఇకనైనా తగ్గుతాయన్న ఆశలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) తీసుకొచ్చిన వర్చువల్ అసిస్టెంట్‌ 'ఆస్క్ దిశా 2.0' (AskDISHA 2.0) ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఇది కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేస్తుంది. రైల్వేకు సంబంధించిన అనేక సేవలను ఒక్క క్లిక్‌తో పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ చాట్‌బాట్‌ను IRCTC వెబ్‌సైట్‌లోనూ, మొబైల్‌ యాప్‌లోనూ యాక్సెస్‌ చేయొచ్చు. వాయిస్ కమాండ్లతోనూ పనిచేసే ఈ సౌకర్యం ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ భాషల్లో అందుబాటులో ఉంది.

Details

ఓటీపీ సాయంతో టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు

పాస్‌వర్డ్ లేకుండానే ఓటీపీ సాయంతో టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. టికెట్ క్యాన్సిలేషన్, ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్లకు సంబంధించి త్వరితగతిన రీఫండ్ పొందడంలో 'ఆస్క్ దిశా 2.0' సహాయపడుతుంది. భవిష్యత్తులో వేగవంతంగా టికెట్ బుకింగ్ చేయేందుకు ప్రయాణికుల వివరాలను ఇది సురక్షితంగా సేవ్ చేస్తుంది. బ్రౌజర్‌లో "AskDISHA 2.0" అని టైప్ చేయగానే సంబంధిత వెబ్‌పేజీ లింక్ ఓపెన్ అవుతుంది. దానిపై క్లిక్ చేయగానే టికెట్ బుకింగ్ స్క్రీన్ ప్రత్యక్షమవుతుంది. స్క్రీన్ కింద భాగంలో సెర్చ్‌బార్‌తోపాటు మైక్ ఐకాన్ కనిపిస్తుంది.

Details

క్యాన్సిల్ చేసుకొనే అవకాశం

దీని సాయంతో వాయిస్ కమాండ్స్ ఇవ్వొచ్చు. పక్కనే ఉన్న స్క్రోల్‌లో రిఫండ్ స్టేటస్, క్యాన్సిల్ టికెట్, పీఎన్‌ఆర్ స్టేటస్, బుకింగ్ హిస్టరీ వంటి అనేక ఆప్షన్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఇవి సింగిల్ క్లిక్‌తో యాక్సెస్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు రిఫండ్ స్టేటస్ చెక్ చేయాలనుకుంటే ఆ ఎంప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే స్క్రీన్‌పై టికెట్ క్యాన్సిలేషన్‌, ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్‌, టికెట్ డిపాజిట్ రిసిప్ట్‌ అనే మూడు ఎంప్షన్లు కనిపిస్తాయి. వాటిలో అవసరమైనదాన్ని ఎంచుకుని పీఎన్‌ఆర్ నంబర్ ఎంటర్ చేస్తే.. వెంటనే స్క్రీన్‌పై రిఫండ్ వివరాలు ప్రత్యక్షమవుతాయి.