Loading...
Trump: ఒక్కరోజులో ట్రంప్‌కు రూ.139 కోట్ల లాభం.. జెన్సన్‌కు రూ.3.15 లక్షల కోట్లు!
ఒక్కరోజులో ట్రంప్‌కు రూ.139 కోట్ల లాభం.. జెన్సన్‌కు రూ.3.15 లక్షల కోట్లు!

Trump: ఒక్కరోజులో ట్రంప్‌కు రూ.139 కోట్ల లాభం.. జెన్సన్‌కు రూ.3.15 లక్షల కోట్లు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే ప్రముఖ ఏఐ చిప్‌సెట్ల తయారీ సంస్థ ఎన్విడియా సీఈవోగా జెన్సెన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడం భారీ ఆర్థిక లాభాలకు దారితీసింది. ఈ పరిణామంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు జెన్సన్ హువాంగ్ సంపద కూడా ఒక్కరోజులోనే గణనీయంగా పెరిగింది. ట్రంప్ ఇటీవల వెల్లడించిన ఆర్థిక వివరాల ప్రకారం.. ఎన్విడియాలో ఆయనకు గరిష్ఠంగా 3.70 లక్షల షేర్లు ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ షేర్ల విలువ ఒక్కరోజులోనే 15 మిలియన్ డాలర్లు (రూ.139 కోట్లకు పైగా) పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎన్విడియా సీఈవోగా జెన్సన్‌ను తిరిగి నియమిస్తూ సంస్థ డైరెక్టర్ల బోర్డు సోమవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

30 శాతానికి పైగా లాభపడిన ఎన్విడియా షేర్లు

ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఎన్విడియా షేర్లు 30 శాతానికి పైగా లాభపడ్డాయి. ఈ పరిణామంపై ట్రంప్ కూడా స్పందించారు.

జెన్సన్ రాకను స్వాగతిస్తూ తనకు సంబంధించిన ఓ ఐకానిక్ ఫొటోను మార్ఫింగ్ చేసి ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు.

ఎన్నికల ప్రచార సమయంలో తనపై దాడి జరిగినప్పుడు తీసిన ఫొటోను పోలి ఉండేలా ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం.

వివరాలు 

ఒక్కరోజులో జెన్సన్ సంపద రూ.3.15 లక్షల కోట్లు పెరుగుదల

ఎన్విడియాలోకి జెన్సన్ హువాంగ్ తిరిగి రావడం ఆయన వ్యక్తిగత సంపదపైనా భారీ ప్రభావం చూపింది.

సీఈవోగా పునరాగమనం ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆయన వద్ద ఉన్న కంపెనీ షేర్ల విలువ అనూహ్యంగా పెరిగింది.

అమెరికా మార్కెట్లు ముగిసే సమయానికి ఒక్కరోజులోనే ఆయన సంపదకు 34బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.15లక్షల కోట్లు) అదనంగా చేరాయి.

ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్స్ జాబితా అంచనాల ప్రకారం.. జెన్సన్ హువాంగ్ మొత్తం నికర సంపద 144 బిలియన్ డాలర్లకు చేరింది.

ఎన్విడియాలో ఆయనకు భారీ సంఖ్యలో షేర్లు ఉన్నాయి.ఇటీవల మార్కెట్‌లో నెలకొన్న పరిణామాలు,షేర్ల విక్రయాల ఒత్తిడి కారణంగా ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ఆయన స్థానం 10 నుంచి 18వ స్థానానికి పడిపోయింది.

ADVERTISEMENT

వివరాలు 

ఒక్క రోజులో రూ.92 లక్షల కోట్లు

అయితే తాజాగా ఎన్విడియా షేర్లు భారీగా పుంజుకోవడంతో ఆయన మళ్లీ 13వ స్థానానికి చేరుకున్నారు.

జెన్సన్ హువాంగ్‌ను తిరిగి సీఈవోగా నియమించడంతో పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఎన్విడియాలో పెట్టుబడులు వెల్లువెత్తాయి.

దీంతో ఒక్కరోజులోనే కంపెనీ మార్కెట్ విలువకు 1 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.92 లక్షల కోట్లు) అదనంగా చేరింది.

ADVERTISEMENT

వివరాలు 

ఒక్క రోజులో రూ.92 లక్షల కోట్లు

ఫలితంగా ఎన్విడియా మొత్తం మార్కెట్ విలువ 3.98 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.

జెన్సన్ పునరాగమనాన్ని పెట్టుబడిదారులు సానుకూలంగా స్వీకరించడంతో టెక్నాలజీ రంగ షేర్లలోనూ కొనుగోళ్లు పెరిగాయి.

నాస్‌డాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీ నమోదైంది. ముఖ్యంగా చిప్ తయారీ సంస్థలు, ఏఐ మౌలిక సదుపాయాలను అందించే కంపెనీలు, సాఫ్ట్‌వేర్ సంస్థల షేర్లు గణనీయంగా లాభపడ్డాయి.

వీటి జోరుతో నాస్‌డాక్ 100 సూచీలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు దాదాపు 2 ట్రిలియన్ డాలర్లు అదనంగా చేరాయి.

ADVERTISEMENT