LOADING...
Trump tariffs impact:ట్రంప్ టారిఫ్ షాక్.. భారత్‌పై ప్రభావం ఎంత తీవ్రంగా ఉండొచ్చు? 
ట్రంప్ టారిఫ్ షాక్.. భారత్‌పై ప్రభావం ఎంత తీవ్రంగా ఉండొచ్చు?

Trump tariffs impact:ట్రంప్ టారిఫ్ షాక్.. భారత్‌పై ప్రభావం ఎంత తీవ్రంగా ఉండొచ్చు? 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2025
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత్‌పై విధించిన టారిఫ్‌లు (సుంకాలు) అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురు వ్యవహారాన్ని ఆపాదిస్తూ, ట్రంప్ ప్రభుత్వం భారత ఎగుమతులపై 50 శాతం వరకు టారిఫ్‌లు విధించింది. ఈ నిర్ణయంతో భారత ఉత్పత్తులపై అమెరికాలో ధరలు పెరగనుండగా, భారతీయ ఎగుమతుల వృద్ధి మందగించనుంది. దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం, ఈ చర్యలు అన్యాయమైనవని పేర్కొంటూ, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

వివరాలు 

భారత్‌పై ప్రభావం ఎంత..

అమెరికా భారత మొత్తం ఎగుమతుల్లో పెద్ద శాతం కాకపోయినా, ముఖ్యమైన కొన్ని రంగాలపై మాత్రం ఈ టారిఫ్‌లు గణనీయమైన ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా డైమండ్, జ్యువెలరీ, టెక్స్‌టైల్, అప్పారెల్, కెమికల్స్ రంగాలు అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. యూబీఎస్ సంస్థ వెల్లడించిన లెక్కల ప్రకారం, సుమారు $8 బిలియన్ డాలర్ల విలువగల భారత ఎగుమతులు ఈ టారిఫ్‌ల వల్ల ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రత్నాలు, నగలు, వస్త్రాలు, రసాయనాలపై గట్టిగా ప్రభావం పడనుంది.

వివరాలు 

స్టాక్ మార్కెట్‌పై ప్రభావం? 

నిఫ్టీ 50 ఇండెక్స్‌లో అమెరికా డైరెక్ట్ ఎక్స్‌పోజర్ కేవలం 9 శాతం మాత్రమే ఉంది. అందులోనూ అధిక భాగం ఐటీ సర్వీసెస్ రంగానిదే. ప్రస్తుతం విధించిన టారిఫ్‌లు ఐటీ రంగంపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశమూ లేదు. అంతేకాక, భారతీయ ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లు, అల్యూమినియం, ఉక్కు రంగాలపై కూడా ఈ టారిఫ్‌లు ప్రభావితం చేసే సూచనలు లేవు. అందువల్ల భారత మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద కాకుండా, కొన్ని ముఖ్యమైన ఎగుమతులపై మాత్రమే ఈ ప్రభావం పరిమితమయ్యేలా ఉంది.

వివరాలు 

పరిశ్రమలపై ప్రత్యక్ష ముప్పు 

ఈ టారిఫ్‌ల వల్ల రత్నాలు, వస్ర్తాలు, కెమికల్స్ రంగాలు బలమైన పోటీ లోటును ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే ఉన్న మార్కెట్లను కోల్పోయే ప్రమాదంతో పాటు, వ్యాపారులు కొత్త మార్కెట్ల కోసం వెతుకులాట ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సరుకుల ధరలు పెరగడం, విదేశీ ఆర్డర్లు తగ్గిపోవడం, దీంతో ఉద్యోగాల్లో కోతలు రావడం వంటి ప్రతికూల పరిస్థితులు కనిపించే సూచనలు ఉన్నాయి. ఈ దృష్టితో టార్గెట్ అయిన రంగాలకు ప్రభుత్వం ప్రత్యేక సహాయ ప్యాకేజీలు ప్రకటించే అవకాశం ఉంది.

వివరాలు 

ఈ రంగాలు తాత్కాలికంగా నష్టాలు చవిచూడవచ్చు

ట్రంప్ ప్రభుత్వం విధించిన టారిఫ్‌లు వల్ల భారత్‌కు చెందిన జ్యువెలరీ, టెక్స్‌టైల్స్‌, కెమికల్స్ రంగాలు తాత్కాలికంగా నష్టాలు చవిచూడవచ్చు. అయితే ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాలపై ప్రభావం లేకపోవడం వల్ల భారత మార్కెట్ మొత్తం మీద పెద్దగా దెబ్బ తగిలే అవకాశం తక్కువ. ఇదే సమయంలో, భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా స్పందించి అవసరమైన మద్దతు చర్యలు తీసుకుంటే, ఈ సమస్యను సమర్థవంతంగా అధిగమించవచ్చు.