
Twitter bird logo: ట్విటర్ బ్లూ బర్డ్ లోగోకు భారీ ధర.. వేలంలో ఎంత పలికిందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ (ప్రస్తుతం ఎక్స్) ఎలాన్ మస్క్ అధీనంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులకు గురైంది.
మస్క్ అధికారం చేపట్టిన తరువాత, ట్విట్టర్ బ్రాండ్ గుర్తింపుగా ఉన్న బ్లూబర్డ్ లోగోను తొలగించి 'ఎక్స్'గా రీబ్రాండ్ చేశారు.
తాజాగా ఈ ఐకానిక్ బ్లూబర్డ్ లోగోను 'ఆర్‌ఆర్ ఆక్షన్' సంస్థ వేలం వేసింది. ఈ వేలంలో బ్లూబర్డ్ లోగో దాదాపు 35 వేల డాలర్లకు (సుమారు రూ.30 లక్షలకు) అమ్ముడైంది.
ఒకప్పుడు శాన్‌ఫ్రాన్సిస్కోలోని హెడ్‌క్వార్టర్ వద్ద ఉన్న ఈ బ్లూబర్డ్ లోగో వేలంలో భారీ ధర పలికిందని 'ఆర్‌ఆర్ ఆక్షన్' సంస్థ వెల్లడించింది.
12 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 254 కిలోల బరువున్న ఈ లోగో రూ.30 లక్షలకు అమ్ముడుపోయింది.
Details
కంటెంట్ మోడరేషన్‌లోనూ అనేక మార్పులు
దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచారు. 2022 అక్టోబర్‌లో ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 44 బిలియన్ డాలర్లతో ఈ డీల్ పూర్తయింది.
స్టాక్ ఒక్కోటి 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు చేశారు. టేకోవర్ అనంతరం కంపెనీలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చారు.
దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు, ట్విటర్ పేరును 'ఎక్స్'గా మార్చారు. కంటెంట్ మోడరేషన్‌లోనూ అనేక మార్పులు చేశారు.
పాత ట్విటర్ బ్రాండ్‌కు సంబంధించిన ముఖ్యమైన జ్ఞాపకాలను వేలానికి పెట్టారు, ఇందులో ప్రధాన కార్యాలయం పైన ఉన్న పిట్ట బొమ్మ సైన్‌బోర్డ్ కూడా ఉంది.