Page Loader
అన్నిటికి ఉపయోగపడే యాప్ కోసం పేమెంట్ టూల్స్ పై పని చేస్తున్న ట్విట్టర్
ఏడాదిలోగా ప్రక్రియను పూర్తి చేయాలని ట్విట్టర్ ప్రణాళిక వేస్తుంది

అన్నిటికి ఉపయోగపడే యాప్ కోసం పేమెంట్ టూల్స్ పై పని చేస్తున్న ట్విట్టర్

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 31, 2023
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలోన్ మస్క్ ట్విటర్‌ని పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌గా తయారుచేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం, ఈ సోషల్ మీడియా సంస్థ పేమెంట్ టూల్స్ పై పనిచేయడం ప్రారంభించింది. ఈ ఫీచర్‌ని ప్రవేశపెట్టడం ద్వారా ట్విట్టర్‌ని అన్నిటికి ఉపయోగపడే యాప్ లాగా మార్చాలనే ఉద్దేశంతో ఉన్నారు ఆ సంస్థ సిఈఓ మస్క్. ఈ ప్రాజెక్ట్‌ బాధ్యతలు ట్విట్టర్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ ఎస్తేర్ క్రాఫోర్డ్ చూసుకుంటున్నారు. US ట్రెజరీలో చెల్లింపుల ప్రాసెసర్‌గా నమోదు చేసుకోవడం రాష్ట్ర లైసెన్సుల కోసం దరఖాస్తు చేయడం వంటి వాటితో పాటుగా US అంతటా ఆపరేట్ చేయడానికి కంపెనీ ఇప్పటికే రెగ్యులేటరీ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించిందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.

ట్విట్టర్

ట్విట్టర్‌ను పేమెంట్స్ ప్లాట్‌ఫారమ్‌గా మార్చడం వలన అవసరమైన ఆదాయం లభిస్తుందని భావిస్తుంది

ట్విట్టర్‌ను సోషల్ మీడియా తో పాటు పేమెంట్స్ ప్లాట్‌ఫారమ్‌గా మార్చడం వలన అవసరమైన ఆదాయం లభిస్తుందని ట్విట్టర్ భావిస్తుంది. కంపెనీ సాఫ్ట్‌వేర్ విషయాలపై కూడా పనిచేస్తోందని సమాచారం. ఏడాదిలోగా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రణాళిక వేస్తుంది. ఈ కంపెనీ భవిష్యత్తులో క్రిప్టో చెల్లింపులకు అవకాశం కల్పించే విధంగా యాప్ ను రూపొందించాలని భావిస్తున్నారు. ఈ పేమెంట్ ఫీచర్ వార్తలు మస్క్ క్రిప్టోకరెన్సీ అయిన Dogecoin ధర పెరుగుదలకు దారితీసింది. దైనందిన జీవితంలో అవసరమైన ప్రతిదాన్ని ఒకే యాప్ లో అందుబాటులో ఉండేలా ట్విట్టర్ ను తీర్చిదిద్దేలా మస్క్ ప్రయత్నిస్తున్నాడు. అతను ట్విట్టర్‌ను కొనుగోలు చేయడంతో ఆ దిశగా మొదటి అడుగు పడింది.