NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Ola-Uber: ఉబర్‌, ఓలా సంస్థలకు కేంద్రం నోటీసులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ola-Uber: ఉబర్‌, ఓలా సంస్థలకు కేంద్రం నోటీసులు
    ఉబర్‌, ఓలా సంస్థలకు కేంద్రం నోటీసులు

    Ola-Uber: ఉబర్‌, ఓలా సంస్థలకు కేంద్రం నోటీసులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 23, 2025
    03:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఉబర్ (Uber), ఓలా (OLA) సంస్థలపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ (Consumer Affairs) స్పందించింది.

    ఈ రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

    వినియోగదారుల ఫిర్యాదుల ప్రకారం, ఈ యాప్‌లు ఫోన్ మోడల్‌ను బట్టి ఛార్జీలను నిర్ణయిస్తున్నాయన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి.

    ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్‌లతో పాటు, ఫోన్ ధర ఆధారంగా కూడా ఛార్జీల్లో మార్పులు ఉన్నాయని పలువురు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.

    ఈ నేపథ్యంలో, ఈ ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఉబర్, ఓలా సంస్థలను కేంద్రం ఆదేశించింది.

    వివరాలు 

    కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ దర్యాప్తు

    అలాగే, ఒకే రకం సర్వీసుకు ఈ రెండు సంస్థలు వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని కొందరు ఫిర్యాదు చేశారు.

    ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించిన కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది.

    ఒకే రకం సేవకు వేర్వేరు ధరలు ఎలా నిర్ణయిస్తారో, ఈ ధరల్లో వ్యత్యాసానికి కారణాలు ఏమిటో వివరణ ఇవ్వాలని సీసీపీఏ స్పష్టం చేసింది.

    ఛార్జీల విషయంలో పారదర్శకతకు ప్రాముఖ్యత ఇవ్వాలని, నిజాయితీతో కూడిన వివరణ అందించాలని పేర్కొంది.

    వివరాలు 

     రిషభ్ సింగ్ పోస్ట్ వైరల్‌

    ఇటీవల, ఢిల్లీకి చెందిన రిషభ్ సింగ్ అనే వ్యక్తి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం వైరల్‌గా మారింది.

    ఉబర్ సంస్థ కేవలం ఫోన్ మోడల్ ఆధారంగా మాత్రమే కాకుండా, ఫోన్‌లో బ్యాటరీ శాతం ఆధారంగా కూడా ఛార్జీల్లో తేడాలు చూపిస్తోందని ఆయన ఆరోపించారు.

    ఆయన తన పరిశీలన కోసం రెండు ఆండ్రాయిడ్ , రెండు ఐఓఎస్ డివైజ్‌లను ఉపయోగించి, అన్ని డివైజ్‌లలో ఒకే అకౌంట్‌తో లాగిన్ అయ్యి, ఒకే ప్రదేశానికి రైడ్ బుక్ చేయగా ఛార్జీల్లో తేడా కనిపించిందని తెలిపారు.

    ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఫలితంగా, ఈ విషయంపై కేంద్రం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓలా

    తాజా

    Big Breaking: పాక్ ప్రధాని ఇంటి సమీపంలో బాంబుపేలుళ్లు.. సురక్షిత ప్రాంతానికి పాకిస్తాన్ ప్రధాని..!  పాకిస్థాన్
    Indian Air Force: రంగంలోకి దిగిన భారత వాయుసేన.. పెషావర్‌పై బాంబుల వర్షం ఆపరేషన్‌ సిందూర్‌
    High Alert: సరిహద్దు రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేత, అత్యవసర ఏర్పాట్లు ఆపరేషన్‌ సిందూర్‌
    INS Vikrant: రంగంలోకి INS విక్రాంత్.. కీలకమైన కరాచీ పోర్ట్ ను పూర్తిగా ధ్వంసం చేసిన భారత నేవీ  ఆపరేషన్‌ సిందూర్‌

    ఓలా

    ఐదుగురు ట్విటర్‌ వినియోగదారులు ఓలా S1 హోలీ ఎడిషన్‌ను గెలుచుకునే అవకాశం ఆటో మొబైల్
    EV Chargers: ఓలా, ఎథర్, హీరో, టీవీఎస్ కస్టమర్లకు డబ్బు రీఫండ్ ఎలక్ట్రిక్ వాహనాలు
    Ola S1 Air : ఓలా ఎస్​1 ఎయిర్​లో ఫీచర్స్ మాములుగా లేవుగా..! ఎలక్ట్రిక్ వాహనాలు
    ఓలా కీలక నిర్ణయం.. ఇకపై హైదరాబాద్‌లోనూ ప్రైమ్ ప్లస్ సేవలు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025