
ఉదయ్ కోటక్ కీలక నిర్ణయం.. కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ, ఎండీ పోస్టులకు రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. వ్యవస్థాపకుడిగా కోటక్ బ్రాండ్‌తో ఎక్కువగా అనుబంధాన్ని కలిగి ఉన్నట్లు ఉదయ్ పేర్కొన్నారు. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సహా ముఖ్య వాటాదారుగా సేవలను కొనసాగిస్తానన్నారు.
సంస్థ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తేందుకు తమ వద్ద అత్యుత్తమ నిర్వహణ బృందం ఉందన్నారు. ఈ మేరకు సంస్థ శాశ్వతంగా ముందుకు సాగుతుందన్నారు.
భారతదేశంలో గొప్ప ఆర్థిక సంస్థను సృష్టించాలన్న కలతో 38 ఏళ్ల క్రితం కోటక్ మహీంద్రాను ముంబైలోని ఫోర్ట్‌లో ముగ్గురు ఉద్యోగులతోనే ప్రారంభించానన్నారు.
ఆర్‌బీఐ, బ్యాంక్ బోర్డ్ సభ్యుల ఆమోదానికి లోబడి దీపక్ గుప్తా, డిసెంబర్ 31 వరకు ఎండీ, సీఈవోగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారని బ్యాంకు ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉదయ్ కొటక్ రాజీనామా లేఖ
My letter is attached pic.twitter.com/vcSIEcvy2r
— Uday Kotak (@udaykotak) September 2, 2023