Budget 2026: ఫిబ్రవరి 1న బడ్జెట్… ట్యాక్స్‌పేయర్లకు శుభవార్త ఉంటుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ఉభయ సభల్లో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కి ఇంకా 10 రోజుల సమయం మాత్రమే ఉండటంతో సామాన్య ప్రజలు, మధ్యతరగతి, వ్యాపార వర్గాల అంచనాలు పెరుగుతున్నాయి. సామాన్యులు ప్రభుత్వ పథకాలు ఆశిస్తుండగా.. మధ్యతరగతి ప్రజలు ట్యాక్స్‌ల్లో మరింత మినహాయింపుల కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాపార వర్గాలు పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు, పన్ను మినహాయింపులు, జీఎస్టీ రేట్ల సవరణలపై ప్రత్యేక డిమాండ్లను పెడుతున్నారు. ముఖ్యంగా, ఈసారి ఆదాయపు పన్ను విధానంలో ఏవిధమైన రిలీఫ్‌లు ఉండబోతున్నాయో, పలు వార్తా వర్గాల చర్చ ప్రధానంగా ఈ అంశంపైే కేంద్రీకృతమై ఉంది. ఈ క్రమంలో కేంద్రం ఓ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
వివరాలు
పాత ట్యాక్స్ విధానం రద్దు అవ్వనుందా?
ప్రస్తుతం ఆదాయపు పన్ను చెల్లింపులో రెండు విధానాలు ఉన్నాయి: పాత ట్యాక్స్ రెజీమ్, కొత్త ట్యాక్స్ రెజీమ్. చెల్లింపుదారులు తమకు అనుకూలంగా ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, కేంద్రం ఆదాయపు పన్ను వ్యవస్థను ఏకీకృతం చేయాలని చూస్తోంది. పాత ట్యాక్స్ రెజీమ్‌ను దశలవారీగా కొత్త విధానంలోకి మార్చేలా బడ్జెట్‌లో కీలక ప్రకటన ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది.
వివరాలు
పాత విధానం vs కొత్త విధానం - తేడాలు
పాత, కొత్త ట్యాక్స్ విధానాలను పోల్చితే, కొన్ని ముఖ్యమైన భిన్నతలు ఉన్నాయి: కొత్త ట్యాక్స్ రెజీమ్ అధిక ఆదాయం పొందేవారికి తక్కువ పన్ను రేట్లు వహిస్తుంది. తగ్గింపులు, మినహాయింపులు కొత్త విధానంలో తక్కువగా ఉంటాయి. కొత్త విధానంలో రూ.12.75 లక్షల వరకు ఆదాయం పొందేవారికి పన్ను తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే నెలకు లక్షలవారీ ఆదాయంపై జీరో పన్ను ఉంటుంది. పాత విధానంలో తగ్గింపులు, మినహాయింపులు ఎక్కువగా ఉండటం వల్ల, కొత్త ట్యాక్స్ రెజీమ్‌ను లాభదాయకంగా మార్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
వివరాలు
పాత ట్యాక్స్ విధానంలో మినహాయింపులు
పాత ఇన్‌కమ్ ట్యాక్స్ రెజీమ్‌లో ముఖ్యంగా ఈ మినహాయింపులు ఉన్నాయి: సెక్షన్ 80సీ కింద ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్ వంటి పెట్టుబడులపై రూ.1.5 లక్షల వరకు మినహాయింపు. హెల్త్ ఇన్యూరెన్స్ కోసం సెక్షన్ 80డీ కింద మినహాయింపులు. ఎన్‌పీఎస్, హౌస్ రెంట్ అలవాన్స్, లీవ్ ట్రావెల్ అలవాన్స్, బ్యాక్ డిపాజిట్లపై వడ్డీపై సెక్షన్ 80టిటిఏ క్రింద మినహాయింపు. హౌస్ లోన్ వడ్డీపై పన్ను లాభాలు.