LOADING...
UPI payments: రికార్డు స్థాయిలో యూపీఐ చెల్లింపులు.. రూ.24.85 లక్షల కోట్లు బదిలీ
రికార్డు స్థాయిలో యూపీఐ చెల్లింపులు.. రూ.24.85 లక్షల కోట్లు బదిలీ

UPI payments: రికార్డు స్థాయిలో యూపీఐ చెల్లింపులు.. రూ.24.85 లక్షల కోట్లు బదిలీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2025
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన దేశంలో యూపీఐ (UPI) లావాదేవీల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. కిరాణా దుకాణంలో చిన్న వస్తువు కొనుగోలు చేయడానికి కూడా ప్రజలు యూపీఐ ఆధారిత డిజిటల్‌ చెల్లింపులను ఎక్కువగా చేస్తున్నారు. దీంతో ఒక్క ఆగస్టు నెలలోనే 20 బిలియన్లకు (రెండు వేల కోట్లకు) పైగా లావాదేవీలు నమోదయ్యాయి. వాటి ద్వారా రూ.24.85 లక్షల కోట్లు బదిలీ అయ్యాయి. అయితే ఈ మొత్తం జులైలో నమోదైన రూ.25.08 లక్షల కోట్లతో పోల్చితే కొంత తగ్గింది. లావాదేవీల పరంగా చూస్తే, గతేడాది ఆగస్టుతో పోలిస్తే 33 శాతం వృద్ధి చోటుచేసుకుంది. ఈ రికార్డు స్థాయి లావాదేవీలకు పండుగ సీజన్ కూడా దోహదపడింది.

Details

ఒక్కరోజులోనే రూ.100 కోట్ల లావాదేవీలు

ఆగస్టు 2న ఒక్కరోజే 700 మిలియన్ల లావాదేవీలు జరగ్గా, యూపీఐ చరిత్రలో ఆ మార్కు తొలిసారిగా అధిగమించారు. వెంటనే మరోరోజు 721 మిలియన్ల లావాదేవీలు నమోదు కావడం విశేషం. ఇకపై ఒక్కరోజులోనే రూ.100 కోట్ల లావాదేవీలు జరగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గణాంకం వచ్చే ఏడాదికల్లా చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలాఉంటే, యూపీఐపై లావాదేవీల ఛార్జీలు విధించే ఆలోచన ప్రస్తుతం లేదని ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ స్పష్టం చేశారు. 'యూపీఐ సేవలు నిరంతరాయంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.8,730 కోట్ల ప్రోత్సాహకాలు అందించిందని ఆయన వివరించారు.

Details

85శాతం ద్వారానే యూపీఐ సేవలు

2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (UPI)ను ప్రారంభించింది. అప్పటినుంచి యూపీఐ వినియోగం సంవత్సరానికో స్థాయిలో పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం దేశంలోని మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 85 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ప్రపంచంలో రియల్‌టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 50 శాతం లావాదేవీలు ఒక్క భారత్‌లోనే జరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌తో పాటు యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్‌ వంటి ఏడు దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇకపై బ్రిక్స్‌ సభ్య దేశాలకు కూడా యూపీఐని విస్తరించే దిశగా రిజర్వు బ్యాంకు యోచిస్తోంది. వేగవంతమైన, సురక్షితమైన లావాదేవీల వలన యూపీఐ ప్రజల్లో ఇంతటి ఆదరణ పొందిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.