LOADING...
Urban Company IPO: అర్బన్‌ కంపెనీ ఐపీఓ.. షేర్లకు ఊహించని డిమాండ్‌!
అర్బన్‌ కంపెనీ ఐపీఓ.. షేర్లకు ఊహించని డిమాండ్‌!

Urban Company IPO: అర్బన్‌ కంపెనీ ఐపీఓ.. షేర్లకు ఊహించని డిమాండ్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2025
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

యాప్‌ ఆధారిత హోమ్‌ సర్వీసులు అందించే అర్బన్‌ కంపెనీ ఐపీఓ (Urban Company IPO) పెట్టుబడిదారుల నుంచి ఊహించని స్థాయిలో స్పందనను దక్కించుకుంది. మంగళవారం బిడ్డింగ్‌ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఈ ఐపీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయింది. రిటైల్‌, నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల కోటా 100 శాతం సబ్‌స్క్రైబ్‌ కాగా, మధ్యాహ్నం 12.45 గంటల నాటికి ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం.. 10,67,73,244 షేర్లకు బదులుగా 13,54,38,410 షేర్లకు బిడ్లు వచ్చాయి. మొత్తంగా 1.27 రెట్లు డిమాండ్‌ నమోదైంది. ఇందులో రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటా 3.84 రెట్లు, ఎన్‌ఐఐ విభాగం 1.67 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి.

Details

తన

క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల కేటగిరీ మాత్రం 20 శాతం వరకు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. రూ.1900 కోట్లను సమీకరించడమే లక్ష్యంగా అర్బన్‌ కంపెనీ ఈ ఐపీఓను జారీ చేసింది. సబ్‌స్క్రిప్షన్‌ ఈనెల 12 వరకు కొనసాగుతుంది. షేర్‌ ధరల శ్రేణిని కంపెనీ రూ.98-103గా నిర్ణయించింది. ఇప్పటికే యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.854 కోట్లను సమీకరించింది. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా రూ.1428 కోట్ల విలువైన షేర్లను 'ఆఫర్‌ ఫర్‌ సేల్‌' రూపంలో విక్రయించగా.. మరో రూ.472 కోట్ల విలువైన కొత్త షేర్లను కంపెనీ జారీ చేసింది. ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను టెక్నాలజీ అభివృద్ధి, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కార్యాలయాల లీజు చెల్లింపులు, మార్కెటింగ్‌, అలాగే సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు అర్బన్‌ కంపెనీ తెలిపింది.