
Donald Trump: ఫెడ్ చైర్మన్ పావెల్ పై ట్రంప్ విమర్శలు..అమెరికా స్టాక్స్,డాలర్ పతనం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా స్టాక్ మార్కెట్లు మళ్లీ పడిపోయాయి.అలాగే అమెరికన్ కరెన్సీ అయిన డాలర్ విలువ కూడా తగ్గుముఖం పట్టింది.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన వ్యవహార శైలి అమెరికాలో ఆర్థిక స్థిరతపై ప్రభావం చూపిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అధిపతి జెరోమీ పావెల్ పై ట్రంప్ చేసిన విమర్శలు మార్కెట్లను ఒక్కసారిగా కుదేలు చేశాయి. వడ్డీ రేట్లను తగ్గించడంలో జెరోమీ విఫలమయ్యారని విమర్శించిన ట్రంప్, ఆయనను "పెద్ద లూజర్" అంటూ పిలవడం ద్వారా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తన సోషల్ మీడియా వేదికగా ఈ ఆరోపణలు చేసిన ట్రంప్, పావెల్ ఆర్థిక వృద్ధిపై సరైన విధంగా స్పందించడంలేదని మండిపడ్డారు.
వివరాలు
బంగారం ధరలకు ప్రోత్సాహం
అమెరికా ఆర్థిక వ్యవస్థను పావెల్ సమర్థంగా నిర్వహించడంలేదని ట్రంప్ అన్నారు.
మరోవైపు ట్రంప్ తీసుకున్న సుంకాల పెంపు నిర్ణయాల కారణంగా మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇది ఆర్థిక మాంద్యం వస్తుందేమోనన్న భయాన్ని అమెరికన్ ప్రజలలో పెంచింది. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో సోమవారం నాడు స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి.
ముఖ్యంగా ఎస్ అండ్ పీ 500 కంపెనీల షేర్లు దాదాపు 2.4 శాతం మేర తగ్గిపోయాయని మార్కెట్ నిపుణులు వెల్లడించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలకు ప్రోత్సాహం లభించింది. పెట్టుబడిదారులు భద్రత కోసం బంగారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల, ఆ ముల్యాలు గణనీయంగా పెరిగిపోయాయి.