Vishal Mega Mart: విశాల్ మెగామార్ట్ 33.33% ప్రీమియంతో మార్కెట్లో ఎంట్రీ!
దేశవ్యాప్తంగా ఉన్న సూపర్‌మార్ట్‌లను నిర్వహిస్తున్న విశాల్ మెగామార్ట్ తొలి పబ్లిక్ ఇష్యూను ఈరోజు దలాల్ స్ట్రీట్‌లో ప్రవేశపెట్టింది. మదుపర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ఐపీఓ షేర్లు నేడు మార్కెట్‌లో నమోదయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్లు రూ.104 వద్ద ప్రారంభమయ్యాయి. అంటే ఇష్యూను రూ.78తో పోల్చితే 33.33 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ఈ ఐపీఓ ద్వారా విశాల్ మెగామార్ట్ రూ.8,000 కోట్ల సమీకరణ లక్ష్యంగా వచ్చింది. షేర్ ధరల శ్రేణి రూ.74-78గా నిర్ణయించారు. ఐపీఓ పూర్వం అన్ని కోటాల్లో మంచి స్పందన లభించింది, మొదలైన తొలిరోజు నుంచే 28 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది.
మొబిక్విక్ ఐపీఓకు అనూహ్య ఆదరణ
క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్ల కోటా 85.11 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 2.43 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా ఈ కంపెనీ రూ.2,400 కోట్లు సమీకరించింది. ఫిన్‌టెక్ సంస్థ అయిన వన్ మొబిక్విక్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ కంపెనీ షేర్లు రూ.442.25 వద్ద లిస్ట్ అయ్యాయి. రూ. 279తో పోలిస్తే 58.51 శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది. మొబిక్విక్ ఐపీఓ స్టార్ట్ అవ్వగానే తొలిరోజు అనూహ్య ఆదరణను పొందింది. మొదటి గంటలోనే పూర్తి సబ్‌స్క్రిప్షన్ అయ్యింది. చివరిరోజు ఈ ఐపీఓ 119.38 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. మొత్తం రూ.572 కోట్ల ఐపీఓలో భాగంగా 1.18 కోట్ల షేర్లను జారీ చేయాలని నిర్ణయించుకుంది.