Page Loader
We Work : బెంగళూరు,హైదరాబాద్‌లలో 4,000 డెస్క్‌లతో విస్తరించిన వీ వర్క్ ఇండియా
4,000 డెస్క్‌లతో విస్తరించిన వీ వర్క్ ఇండియా

We Work : బెంగళూరు,హైదరాబాద్‌లలో 4,000 డెస్క్‌లతో విస్తరించిన వీ వర్క్ ఇండియా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 16, 2023
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

We Work India సంస్థ భారీగా విస్తరిస్తోంది. ఈ మేరకు భారతదేశంలోని ప్రధాన మెట్రో మహనగరాలైన హైదరాబాద్, బెంగళూరులో 4000 డెస్క్‌లతో వీ వర్క్ సంస్థ కొత్త డెస్కులను స్థాపించింది. ఈ క్రమంలోనే 2.72 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 4,000 డెస్క్‌లను అదనంగా ఏర్పాటు చేయడం ద్వారా బెంగళూరు, హైదరాబాద్‌లలో తన ఉనికిని విస్తరించనుంది. బెంగళూరులోని మాన్యతా రెడ్‌వుడ్, హైదరాబాద్‌లోని RMZ స్పైర్‌లో ఉన్న కొత్త డెస్క్ లను రాబోయే నెలల్లో ప్రారంభించనున్నారు. We Work Indiaలో రియల్ ఎస్టేట్, ఉత్పత్తి, ప్రొక్యూర్‌మెంట్ హెడ్ అర్నవ్ S Gusain, వ్యాపారాల కోసం వినూత్నమైన, అనుకూలమైన వర్క్‌స్పేస్ సొల్యూషన్‌లను అందించడంలో వీ వర్క్ కంపెనీ అంకితభావాన్ని ప్రదర్శిస్తుందని సంస్థ వ్యక్తం చేసింది.

details

హైదరాబాద్ మహానగరంలో 1.54 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం

మాన్యతా రెడ్‌వుడ్ సంస్థ, బెంగళూరులోని మాన్యతా టెక్ పార్క్‌లో మూడు అంతస్తులు, 1.17 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రదేశం సుమారు 1,700 డెస్క్‌లను కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ద్వారా అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉంది.బైయప్పనహళ్లి మెట్రో స్టేషన్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ విస్తరణ పరిశ్రమలో అసాధారణమైన వర్క్‌స్పేస్ అనుభవాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి We Work ఇండియా వ్యూహంలో భాగంగా కొనసాగనుంది. హైదరాబాద్‌లోని WeWork ఇండియా ఫ్లాగ్‌షిప్ ప్రాపర్టీ,RMZ స్పైర్, HITECH సిటీలో ఉంది.2,220 డెస్క్‌లతో నాలుగు అంతస్తులలో 1.54 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైంది. we work కంపెనీ ప్రత్యేక సంస్థగా పనిచేస్తుందని CEO కరణ్ విర్వానీ అన్నారు.