LOADING...
Gold Rates : బంగారం కొనుగోలుచేసేవారికి శుభవార్త.. ఇవాళ తగ్గిన రేట్లు.. తులం ఎంతంటే..?
తులం ఎంతంటే..?

Gold Rates : బంగారం కొనుగోలుచేసేవారికి శుభవార్త.. ఇవాళ తగ్గిన రేట్లు.. తులం ఎంతంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు మళ్లీ కొంత తగ్గాయి. గురువారం స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేట్లు శుక్రవారం తిరిగి తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో స్థిరత్వం లేకుండా ఎప్పటికప్పుడు మార్పులు కనిపిస్తున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో అంచనా వేయడం సాధారణ వినియోగదారులకు కష్టంగా మారింది. ఇదిలా ఉండగా గురువారం వెండి ధర ఒక్కసారిగా రెండు లక్షల రూపాయల మార్క్‌ను తాకి ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచింది. అయితే ఇవాళ బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఉన్న ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

వివరాలు 

ప్రధాన నగరాల్లో ఉన్న ధరల వివరాలు

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,650గా కొనసాగుతోంది. గురువారం ఇది రూ.1,29,660గా ఉండగా, ఇవాళ రూ.10 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,18,840 వద్ద కొనసాగుతోంది. గురువారం ఈ ధర రూ.1,18,850గా నమోదైంది. విజయవాడలోనూ అదే ధరలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం రూ.1,29,650గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,18,840గా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,31,120గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,20,190గా కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,29,650గా, 22 క్యారెట్ల ధర రూ.1,18,840గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెళ్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,800గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,18,990గా నమోదైంది.

వివరాలు 

వెండి ధరలు 

వెండి ధరలకు వస్తే, హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఇవాళ రూ.1,99,900గా ఉంది. నిన్న రూ.2,00,000గా నమోదైన ధరతో పోలిస్తే ఇవాళ రూ.100 తగ్గింది. చెన్నైలో కూడా కేజీ వెండి రూ.1,99,900 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కేజీ వెండి ధర రూ.1,90,990గా ఉండగా, ఢిల్లీలో రూ.1,90,900గా ఉంది.

Advertisement