Page Loader
డిజిటల్ పేమెంట్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 'యూపీఐ లైట్‌ ఎక్స్‌' గురించి తెలుసా
యూపీఐ లైట్‌ ఎక్స్‌ ఎలా పనిచేస్తోందో తెలుసా

డిజిటల్ పేమెంట్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 'యూపీఐ లైట్‌ ఎక్స్‌' గురించి తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 10, 2023
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2023లో భాగంగా యూపీఐ లైట్ ఎక్స్ (UPI LITE X) అనే కొత్త యూపీఐ సాంకేతికత ప్రారంభమైంది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ కొత్త యూపీఐ టెక్నాలజీని లాంచ్ చేశారు. దీంతో వ్యాపారులు, వినియోగదారులు ఆఫ్‌లైన్‌లో కూడా చెల్లింపులను నిరాటంకంగా చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ పేమెంట్‌లో గేమ్‌ ఛేంజర్‌గా నిలిచిన యూపీఐ పేమెంట్స్, కొనసాగింపుగా యూపీఐ లైట్ ఎక్స్‌తో ముందడుగు పడినట్టైంది. యూపీఐ లైట్‌ ఎక్స్‌ వినియోగం కోసం అదనపు ఛార్జీలేమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా చెల్లింపులకు ప్రధాన వనరుగా మారిన UPIని విస్తరించేందుకు ఈ విప్లవాత్మక సాంకేతికత, లైన్ క్లియర్ చేస్తుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

DETAILS

గ్రామీణ ప్రాంతాల్లో సేవల కోసం యూపీఐ లైట్‌ ఎక్స్‌

యూపీఐ లైట్‌ గతేడాది, ఆర్‌బీఐ పరిధిలోని నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NCPI) ఈ యూపీఐ లైట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. కొత్త విధానంతో యూపీఐ పిన్‌ అవసరం లేకుండానే తొలుత రూ.200 వరకు చెల్లింపులు చేసుకునేందుకు వెసులుబాటు అందిస్తోంది. ఈ క్రమంలో ఆ మొత్తాన్ని రూ.500కి పెంచేసింది. యూపీఐ లైట్ ఎక్స్: యూపీఐ ఆధారంగా పనిచేసే లైట్ ఎక్స్, అంతర్జాలం సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో యూపీఐ పేమెంట్స్‌ చేసేందుకు వీలుగా కేంద్రం యూపీఐ లైట్‌ ఎక్స్‌ను ప్రవేశపెట్టింది. ఫలితంగా ఇంటర్నెట్ లేకుండానే లావాదేవీలు జరిపేందుకు వీలవుతుంది. దీంతో పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉన్న క్రమంలో డబ్బును పంపుకోవచ్చు లేదా పుచ్చుకోవచ్చు. రోజువారీగా ఎంత లిమిట్ ఎంతన్నది ఇంకా తెలియరాలేదు.