
Priya Nair: హిందూస్తాన్ యూనిలీవర్ సీఈఓ,ఎండీగా తొలిసారి మహిళా నాయకత్వం.. ఇంతకీ ఎవరీ ప్రియా నాయర్..?
ఈ వార్తాకథనం ఏంటి
హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (Hindustan Unilever Ltd - HUL) చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ సంస్థకు నాయకత్వం వహించబోతోంది. ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియా నాయర్(Priya Nair)త్వరలోనే మేనేజింగ్ డైరెక్టర్ (MD)చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పదవికి ప్రమోట్ అయిన విషయం తెలిసిందే. ఆమెకు ఈ కొత్త పదవీ బాధ్యతలు వచ్చే ఆగస్టు 1వ తేదీ నుంచి అధికారికంగా అప్పగించనున్నారు. ఇప్పటికే సంస్థ సీఈఓగా ఉన్న రోహిత్ జావా (Rohit Jawa)వ్యక్తిగత కారణాల వల్ల జూలై 31వ తేదీతో తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. దీంతో ఆ తర్వాత ప్రియా నాయర్ సంస్థను ముందుండి నడిపించనున్నారు. ఆమె ఈ పదవిలో ఐదేళ్ల కాలం పాటు కొనసాగనున్నారు.
వివరాలు
ఎవరీ ప్రియా నాయర్..?
హెచ్‌యూఎల్ చరిత్రలో మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఒక మహిళను నియమించడం ఇదే మొదటిసారి కావడంతో ప్రియా నాయర్ ఎవరు? ఆమె గతం ఏంటి? అనే ఆసక్తి పెరిగింది. ప్రియా నాయర్ మహారాష్ట్ర రాష్ట్రంలోని కొల్హాపూర్‌లో మలయాళీ కుటుంబంలో జన్మించారు. ఆమె విద్యాభ్యాసం పూర్తిగా ముంబైలోనే జరిగింది.ముంబై సిడెన్‌హామ్ కాలేజీలో అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లోచదివిన బీకామ్ ఆమె,అనంతరం పుణేలోని సింబియోసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ నుంచి మార్కెటింగ్‌లో ఎంబీఏ చేశారు. తరువాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను కూడా పూర్తిచేశారు. హిందుస్థాన్ యూనిలీవర్‌లో ఆమె ప్రయాణం 1995లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆమె సంస్థలో సేల్స్,మార్కెటింగ్ విభాగాల్లో వివిధ కీలక పాత్రలు నిర్వర్తించారు.
వివరాలు
ఎవరీ ప్రియా నాయర్..?
ముఖ్యంగా హోమ్ కేర్, బ్యూటీ, పర్సనల్ కేర్ విభాగాల్లో ఆమె నేతృత్వంలో అనేక విజయాలు నమోదయ్యాయి. 2014 నుండి 2020 మధ్యకాలంలో హోమ్ కేర్ విభాగం అత్యద్భుతమైన వృద్ధిని సాధించగలిగింది. 1998లో డౌవ్, రిన్, కంఫర్ట్ వంటి ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. అలాగే లాండ్రీ బిజినెస్‌కి నాయకత్వం వహించిన ఆమె, ఓరల్ కేర్, డియోడరెంట్స్, కస్టమర్ డెవలప్‌మెంట్ వంటి విభాగాల్లోనూ పనిచేశారు. 2020 నుంచి 2022 వరకు బ్యూటీ & పర్సనల్ కేర్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందించారు. అనంతరం యూనిలీవర్‌లో గ్లోబల్ బ్యూటీ & వెల్‌బీయింగ్ విభాగానికి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. 2023 నుండి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.