Deutsche Bank: వడ్డీరేట్ల కోతల్ని ఆలస్యం చేసినకొద్దీ దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం: డ్యూషే బ్యాంక్
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే నెలలో జరిగే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ ) రెపోరేటును కనీసం 25బేసిస్ పాయింట్ల వరకు తగ్గించాల్సిన అవసరం ఉందని డ్యూషేబ్యాంక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వడ్డీరేట్ల కోతలను ఆలస్యం చేయడం ద్వారా దేశ ఆర్థికవ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు హెచ్చరించారు.
ప్రస్తుతం రెపోరేటును తగ్గించకపోతే భవిష్యత్తులో జీడీపీవృద్ధిరేటును మరింతగా తగ్గించుకోవలసి వస్తుందని పేర్కొన్నారు.
ఫిబ్రవరి,ఏప్రిల్ సమీక్షల్లో ఆర్బీఐ 0.25శాతం చొప్పున రెపోరేటును తగ్గిస్తుందని,ఈ ఏడాది ప్రథమార్ధంలో రెపోరేటు 6శాతానికి దిగొస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వడ్డీరేట్ల కోతలు తమ ప్రభావం చూపడానికి భారతదేశంలో దాదాపు 9నెలల సమయం పడుతుందని, ఫిబ్రవరిలో ప్రారంభిస్తే ఆర్బీఐ సరైన నిర్ణయం తీసుకున్నట్టవుతుందని వారు తెలిపారు.
వివరాలు
రూపీ పతనం దెబ్బ
గత రెండు సంవత్సరాల్లో వడ్డీరేట్లు స్థిరంగా ఉండడంతో జీడీపీ వృద్ధి తగ్గిపోయిందని, ఫిబ్రవరిలో కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో వడ్డీరేట్లు తగ్గుతాయన్న ఆశా భావన వ్యక్తమవుతోంది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ గతంలో వడ్డీరేట్లను 1 శాతం మేర తగ్గించిన ఉదాహరణను సూచించారు.
డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.22 శాతానికి తగ్గి, జనవరి-జూన్ మధ్య ఇది 4.30 శాతానికి చేరుతుందని అంచనా.
అయితే రూపాయి క్షీణత ఆర్బీఐ వడ్డీరేట్ల కోతకు ప్రధాన అడ్డంకిగా మారింది.
గత నెలలో రూపీ విలువ గణనీయంగా పడిపోవడం దిగుమతులపై భారాన్ని పెంచి ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
వివరాలు
సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.4
గత సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.4 శాతానికి పడిపోవడం ఆర్థిక వ్యవస్థ పునరుత్థానానికి వడ్డీరేట్ల కోతలను అవసరమని స్పష్టం చేస్తోంది.
ఫిబ్రవరిలో ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది, ముఖ్యంగా ఆటో, రియల్టీ, బ్యాంకింగ్ రంగాలు వడ్డీరేట్లపై ఆధారపడి ఉండటంతో, ఆ రంగాల నుంచి తగ్గింపుల డిమాండ్లు జోరుగా వినిపిస్తున్నాయి.