Dubai for Milan: లగ్జరీ జీవితం కోసం మిలాన్‌ను ఎంచుకుంటున్న మిలియనీర్లు
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్‌లో నివసిస్తున్న ధనవంతులలో అనిశ్చితి పెరుగుతోంది. ముఖ్యంగా ఇరాన్ క్షిపణి దాడుల భయం నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన అతి ధనవంతులు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఒకప్పుడు పన్నుల్లేని జీవితం,విలాసవంతమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందిన దుబాయ్ ఆకర్షణ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఇటలీ ఆర్థిక కేంద్రం మిలాన్ కొత్త హబ్‌గా ఎదుగుతోంది. వెల్తీ ఫ్యామిలీలను ఇతర దేశాలకు మార్చే కన్సల్టెంట్ ఆర్మాండ్ ఆర్టన్ ప్రకారం,ఇటలీలో ఫ్లాట్ ట్యాక్స్ విధానం, మంచి జీవన ప్రమాణాలు ప్రధాన ఆకర్షణలు. ఇప్పటికే యూరప్‌లోని ప్రముఖ బ్యాంకర్లు,ఇన్వెస్టర్లు ఉన్న మిలాన్ ఇప్పుడు బ్రిటన్‌కు చెందిన సూపర్ రిచ్‌లను ఆకర్షిస్తోంది. ఇటలీ ఫ్లాట్ ట్యాక్స్ ప్రకారం విదేశీ ఆదాయంపై ఏడాదికి €300,000 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
వివరాలు
ప్రత్యేక పన్ను విధానం పథకం కింద ఇటలీకి 5,000 మంది
మిలాన్‌లోని రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన Diletta Giorgolo చెబుతున్నట్లు, 2017లో ప్రత్యేక పన్ను విధానం ప్రారంభమైనప్పటికీ, బ్రిటన్ నాన్-డామ్ స్టేటస్ రద్దు తర్వాత కొనుగోలుదారులు భారీగా పెరిగారు. ఇప్పటివరకు సుమారు 5,000 మంది ఈ పథకం కింద ఇటలీకి వచ్చారు. మొదట లండన్‌లో నివసించిన ఇటాలియన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, కరోనా తర్వాత, బ్రిటన్ నిర్ణయాల తరువాత గల్ఫ్ ప్రాంతం నుంచి కూడా కొత్త ధనవంతుల వలస పెరుగుతోంది. దీంతో మిలాన్ ప్రాపర్టీ మార్కెట్‌పై ప్రభావం కనిపిస్తోంది. గత ఐదేళ్లలో ఇళ్ల ధరలు 38% పెరిగాయి. 2025 నవంబర్‌లో మిలాన్, Veniceను దాటి దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా మారింది.
వివరాలు
లగ్జరీ బ్రాండ్లు, కల్చరల్ ఇన్స్టిట్యూషన్లకు ఆకర్షణగా మిలాన్
ఇటలీ ప్రభుత్వం "ఇల్ రియంత్రో డై చెర్వెల్లి" అనే పథకం ద్వారా కొత్తగా వచ్చే వారికి ఐదేళ్ల పాటు ఆదాయంలో 50%పైనే పన్ను విధిస్తోంది. అయితే ఫ్లాట్ ట్యాక్స్ పరిమితిని 2017లో €100,000 నుంచి 2026 నాటికి €300,000కు పెంచడంపై చర్చ కొనసాగుతోంది. అయినప్పటికీ, మిలాన్ లగ్జరీ బ్రాండ్లు, కల్చరల్ ఇన్స్టిట్యూషన్లకు ఆకర్షణగా కొనసాగుతోంది.