
SIP Investment: మీ లక్ష్యం రూ.5 కోట్లు అయితే సిప్‌లో నెలకు ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి
ఈ వార్తాకథనం ఏంటి
చిన్న చిన్న పొదుపులతోనే గొప్ప సంపదను కూడబెట్టుకోవచ్చు. ఒక్కో రూపాయి పొదుపు చేస్తే వందలు అవుతాయి,తరువాత లక్షలు, చివరకు కోట్లకు చేరతాయి. పెట్టుబడి పద్ధతిలో ప్రతీ రూపాయికి విలువ ఉంటుంది. కొంత మొత్తాన్ని క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం ద్వారా,మీరు మీ భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా మార్చుకోవచ్చు. మీ ఆదాయం తక్కువైనా, పొదుపు చేసేందుకు అవకాశాలు లేవని కాదు. మీరు ఆసక్తి చూపిస్తే, SIP (సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) వంటి పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టేందుకు అనువుగా ఉంటాయి. దీని ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బును కూడబెట్టుకోవచ్చు.
వివరాలు
ఎంత త్వరగా ప్రారంభిస్తే, అంత ఎక్కువ లాభం!
నిరంతర పెట్టుబడి ద్వారా మీ డబ్బు పెరుగుతుంది. మీరు SIP ద్వారా నెలకు కేవలం రూ. 7,000 పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 5 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చు.దీని కోసం SIP మంచి మార్గంగా ఉంటుంది. SIP అనేది మ్యూచువల్ ఫండ్స్ అందించే పెట్టుబడి విధానం. నెలకు చిన్న మొత్తంలోనే పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడి పెట్టే వారికి SIP చాలా మంచి ఎంపిక. మీరు కేవలం రూ. 100తో కూడా SIP ప్రారంభించవచ్చు. దీనికి ఆటోమేటిక్ బ్యాంక్ డెబిట్ సెటప్ చేసుకోవచ్చు.
వివరాలు
రూ. 7,000 SIPతో ఎలా రూ. 5 కోట్లు చేరుకోవచ్చు?
మీరు రూ. 5 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే, నెలకు రూ. 7,000 పెట్టుబడి పెట్టాలి. ఇది 12% వార్షిక రాబడిని అందిస్తుందని అనుకుందాం. 38 సంవత్సరాలు SIP చేయడం వల్ల: మొత్తం పెట్టుబడి: ₹31,92,000 లాభం: ₹5,13,05,802 మొత్తం నిధి: ₹5,44,97,802 30 సంవత్సరాల పాటు SIP చేయడం వల్ల: మొత్తం పెట్టుబడి: ₹25,20,000 లాభం: ₹1,90,46,812 మొత్తం నిధి: ₹2,15,66,812 20 సంవత్సరాలు SIP చేస్తే: మొత్తం పెట్టుబడి: ₹16,80,000 లాభం: ₹47,59,001 మొత్తం నిధి: ₹64,39,001 10 సంవత్సరాలు SIP చేస్తే: మొత్తం పెట్టుబడి: ₹8,40,000 లాభం: ₹7,28,251 మొత్తం నిధి: ₹15,68,251
వివరాలు
భవిష్యత్తులో ఆర్థిక స్వేచ్ఛ
SIP ఒక సరళమైన, సురక్షితమైన పెట్టుబడి మార్గం. దీని ద్వారా చిన్న మొత్తాలతో ప్రారంభించి, దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో సంపదను కూడబెట్టుకోవచ్చు. క్రమశిక్షణతో పొదుపు చేస్తే, భవిష్యత్తులో ఆర్థిక స్వేచ్ఛ పొందొచ్చు.