Page Loader
RBI: వడ్డీ రేట్లలో మార్పు లేకుండానే.. ద్రవ్యోల్బణం, చమురు ధరలు!
వడ్డీ రేట్లలో మార్పు లేకుండానే.. ద్రవ్యోల్బణం, చమురు ధరలు!

RBI: వడ్డీ రేట్లలో మార్పు లేకుండానే.. ద్రవ్యోల్బణం, చమురు ధరలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2024
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 6.5% వద్ద కొనసాగించనున్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరల పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అవసరం లేదని వారు భావించారు. అయితే డిసెంబరులో వడ్డీ రేట్లలో కోత జరగొచ్చని ఉహాగానాలు విన్పిస్తున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల పరిస్థితి కొనసాగుతుండటంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల సవరణలో అప్రమత్తంగా ఉండనుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లలో కోత ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Details

కొత్తగా ముగ్గురు సభ్యులు

ఈ నెల ప్రారంభంలో ఆర్‌ బి ఐ రేటు సెట్టింగ్ ప్యానల్ మానిటరీ పాలసీ కమిటీని పునరుద్ధరించింది. కొత్తగా ముగ్గురు సభ్యులను నియమించింది. RBI గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఎంపీసీ అక్టోబర్ 7-9 మధ్య సమావేశం నిర్వహించనుంది, సమావేశ నిర్ణయాలను అక్టోబర్ 9న దాస్ ప్రకటించనున్నారు. గతేడాది ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ వడ్డీ రేటును 6.5% వద్దే ఉంచింది. అక్టోబర్‌లో జరిగే సమావేశంలో వడ్డీ రేట్ల సవరించే అవకాశం ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో ఆ రేట్లు యథాతథంగా కొనసాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబరులో మాత్రం రేట్లలో తగ్గింపునకు అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.