Elon Musk: ఎలాన్ మస్క్ కొనుగలు తర్వాత 'ఎక్స్' విలువ భారీగా పతనం
ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) 'ఎక్స్'లో అనేక మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా 'ఎక్స్' విలువ గణనీయంగా పడిపోయినట్లు ప్రముఖ పెట్టుబడుల సంస్థ నివేదక వెల్లడించింది. మరోవైపు యూజర్ల సంఖ్య తగ్గడం, వాణిజ్య ప్రకటనల ఆదాయంలో కుంగుబాటు, కంటెంట్ పై ఆందోళన వంటివి దీనికి కారణమని స్పష్టం చేసింది. మాస్క్ ఎక్స్ ను సొంతం చేసుకున్న కొన్ని నెలల్లోనే యూజర్ల సంఖ్య 15శాతం తగ్గినట్లు పేర్కొంది. ఎక్స్ ను ఎలాన్ మస్క్ 2022 అక్టోబర్‌లో 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
71.5 శాతం కంపెనీ విలువలు పతనం
44 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2023 డిసెంబర్ 30 నాటికి 12.5 బిలియన్ డాలర్లు పతనమైనట్లు ఫెడెలిటీ స్పష్టం చేసింది. మొత్తం మీద 71.5శాతం కంపెనీ విలువలు పతనమయ్యాయి. ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చి అనేక మార్పులను చేశారు. దాదాపుగా ఆ సంస్థలో పనిచేస్తున్న 50శాతం మంది ఉద్యోగులను తొలగించారు. 'ఎక్స్'లో వచ్చిన మార్పులు, సమాచార నియంత్రణా విధానాలను నిరసిస్తూ పలు సంస్థలు వాణిజ్య ప్రకటనలను కూడా నిలిపివేశాయి.