Page Loader
New Rules August 1 : HDFC యూజర్లకు బిగ్ షాక్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్
HDFC యూజర్లకు బిగ్ షాక్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్

New Rules August 1 : HDFC యూజర్లకు బిగ్ షాక్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2024
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఆగస్టు 1 నుంచి క్రెడిట్ కార్డు పాలసీలో అనేక మార్పులను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ రూల్స్ వల్ల క్రెడిట్ కార్డు హోల్డర్ల వివిధ రకాల లావాదేవీలు, రుసుములపై ప్రభావం పడనుంది. ఇక పేటిఎం, క్రెడ్, చెక్ వంటి థర్డ్ పార్టీ చెల్లింపు యాప్‌ల ద్వారా చేసే అద్దె లావాదేవీలపై 1% రుసుమును ప్రవేశపెట్టనుంది. ఈ రుసం ప్రతి లావాదేవీకి రూ.3వేలకి పరిమితం కానుంది.

Details

  యుటిలిటీ చెల్లింపులను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న హెచ్‌డీఎఫ్‌సీ

ఒకవేళ అద్దెను చెల్లించడానికి అదనపు యాప్‌లను ఉపయోగిస్తే డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. 50వేల కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే 1% రుసుం చెల్లించాలి. మరోవైపు ఈ మార్పు అధిక విలువ యుటిలిటీ చెల్లింపులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది. ఇక బీమా సంబంధిత లావాదేవీలు ఈ కొత్త రుసుములకు లోబడి ఉండకపోవడం గమనార్హం. కస్టమర్లు తమ బీమా చెల్లింపులను నిర్వహించే వారికి ఇది కొంత ఉపశమనం కలిగించే అంశం

Details

కొత్త రూల్స్ ఇవే

యుటిలిటీ లావాదేవీలు రూ.50వేలు దాటితే 1% ఫీజు పెట్రోలు, డీజిల్ లావాదేవీలు రూ. 15వేలు దాటితే 1% ఫీజు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా ఎడ్యుకేషన్ చెల్లిస్తే 1% ఫీజు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా రెంటల్ లావాదేవీలపై 1% ఫీజు అంతర్జాతీ లావాదేవీలపై 3.5% ఫీజు లేట్ పేమెంట్ ఫీజు రూ. 100 నుంచి 300కు పెంపు