తదుపరి వార్తా కథనం

Tesla: ఆటోపైలట్ లోపంతో యువతి మృతి.. టెస్లాకు రూ.2100 కోట్ల భారీ జరిమానా
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 02, 2025
09:24 am
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారీ జరిమానాకు గురైంది. 2019లో జరిగిన రోడ్డు ప్రమాదానికి టెస్లా కారులో ఉన్న ఆటోపైలట్ వ్యవస్థ వైఫల్యమే కారణమని ఫ్లోరిడా కోర్టు నిర్ధారించింది. దీంతో టెస్లా బాధితులకు రూ.2100 కోట్లకు సమానమైన 242 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఈ ప్రమాదంలో ఒక యువతి ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కోర్టు విచారణలో టెస్లా ఆటోపైలట్ వ్యవస్థలో ఏర్పడిన లోపాలే ఈ ప్రమాదానికి దారితీశాయని తేల్చింది. ఈ తీర్పుతో టెస్లా సామర్థ్యంపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.