
Zomato: జొమాటోకు ₹184 కోట్ల టాక్స్ నోటీసు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జోమాటోకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఇప్పటికే ఐటీ శాఖ నుంచి పలు టాక్స్ డిమాండ్ నోటీసులు అందుకున్నజొమాటో.. తాజాగా దిల్లీలోని సెంట్రల్ టాక్స్ కమిషనర్ నుంచి రూ. 184.18 కోట్ల GST నోటీసులను అందుకుంది.
సర్వీస్ టాక్స్ క్రింద రూ.92 కోట్లు,అలాగే పెనాల్టీ రూ.92 కోట్లు మొత్తం కలిపి రూ.184 కోట్లు చెల్లించాలని నోటీసులో పేర్కొంది.
అక్టోబర్ 2014 , జూన్ 2017 మధ్య సేవా పన్ను చెల్లించనందుకు ఈ ఆర్డర్ ఇవ్వబడినట్లు సోమవారం అర్థరాత్రి స్టాక్ మార్కెట్‌కు ఒక కమ్యూనికేషన్‌లో Zomato తెలిపింది.
దేశం వెలుపల ఉన్న వినియోగదారులకు కంపెనీ విదేశీ అనుబంధ యూనిట్లు, శాఖల కొంత విక్రయాల ఆధారంగా ఇది నిర్ణయించబడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జొమాటోకు Rs.184 కోట్ల టాక్స్ నోటీసు
Zomato gets service tax demand and penalty order of Rs 184 cr#Zomato #IncomeTax #TaxNotice #DeependerGoyal https://t.co/cHqP14emCm
— NewsDrum (@thenewsdrum) April 2, 2024