Zomato District: జొమాటో కొత్త యాప్.. గోయింగ్ అవుట్ బిజినెస్ కోసం ప్రత్యేక సేవలు
ఫుడ్ డెలివరీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న జొమాటో, ఇప్పుడు టికెటింగ్ సేవల రంగంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో, ట్రావెలింగ్, లైవ్ ఈవెంట్స్, డైనింగ్ వంటి అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'డిస్ట్రిక్ట్ యాప్'ను ప్రారంభించింది. ఈ యాప్ ప్రస్తుతానికి Apple iOS ప్లాట్‌ఫామ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. జొమాటో, ఫాస్ట్ బిజినెస్ విభాగాల్లో లీడర్‌గా ఉన్నప్పటికీ, గోయింగ్ అవుట్ వర్టికల్‌ను వేరుగా అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది. డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా డైనింగ్, లైవ్ ఈవెంట్లు, టికెటింగ్ వంటి సేవలను అందిస్తూ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. 2024 ఆగస్టులో జొమాటో, పేటీఎం ఈవెంట్స్, టికెటింగ్ వ్యాపారాన్ని రూ. 20,048 కోట్లకు కొనుగోలు చేసింది.
డిస్ట్రిక్ట్ యాప్ లాంచ్
ఈ కొనుగోలుతో టికెటింగ్ మార్కెట్‌లో తన ఉనికిని మరింత విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. జొమాటో 'సూపర్ యాప్' కంటే, విభిన్న వ్యాపారాల కోసం ప్రత్యేకమైన సూపర్ బ్రాండ్స్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా, వినియోగదారులకు డైనింగ్ అవుట్ ఆఫర్‌లతో పాటు, సినిమాలు, లైవ్ ఈవెంట్ల టికెట్లను సులభంగా బుక్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ తాజా వ్యాపార విస్తరణతో జొమాటో, వినియోగదారులకు మరింత సమగ్ర సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంది.