Zomato: కొత్త 'రికమండేషన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్' ఫీచర్ విడుదల చేసిన జొమాటో
వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా మారేందుకు ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో (Zomato) కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటి వరకు వినియోగదారులు ఆర్డర్ చేసిన ఆహారంపై మనం ఫీడ్‌బ్యాక్,రేటింగ్ ఇచ్చాం. అయితే, ఫలానా ఫుడ్‌ను మన స్నేహితులకు రికమండ్ చేసే అవకాశం లేదు. ఈ లోటును దృష్టిలో పెట్టుకుని జొమాటో తాజాగా "రికమండేషన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్" అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ ఫీచర్ తాజా వెర్షన్ యాప్‌లో అందుబాటులో..
ఈ కొత్త ఫీచర్‌ను ఒక వారం క్రితమే ప్రారంభించామని, ఇది తాజా వెర్షన్ యాప్‌లో అందుబాటులో ఉంటుందని జొమాటో యాజమాన్యం వెల్లడించింది. ఈ ఫీచర్ ద్వారా, వినియోగదారులు తమ స్నేహితులు సిఫారసు చేసిన రెస్టారెంట్లు, ఆహారపదార్థాలను చూడవచ్చు. ఆసక్తికరమైనవి ఎంచుకుని, వాటిని బుక్ చేసుకోవచ్చు. జొమాటో సీఈవో రాజేశ్ రంజన్ ఒక ప్రకటనలో, "ఈ ఫీచర్ మా వినియోగదారులకు వారి స్నేహితుల ద్వారా సిఫారసు చేసిన ఆహారపదార్థాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది, తద్వారా వారి ఆనందాన్ని పెంచుతుంది" అని తెలిపారు.