Page Loader
Swiggy-Zomato: రెస్టారెంట్లకు అనుకూలంగా జొమాటో, స్విగ్గీ కీలక ఒప్పందాలు.. సీసీఐ నివేదిక
రెస్టారెంట్లకు అనుకూలంగా జొమాటో, స్విగ్గీ కీలక ఒప్పందాలు.. సీసీఐ నివేదిక

Swiggy-Zomato: రెస్టారెంట్లకు అనుకూలంగా జొమాటో, స్విగ్గీ కీలక ఒప్పందాలు.. సీసీఐ నివేదిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2024
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ తీసుకుని డెలివరీ చేసే జొమాటో, స్విగ్గీలు పోటీచట్టాలను ఉల్లంఘించినట్లు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) దర్యాప్తులో వెల్లడించింది. కొన్ని రెస్టారెంట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ, వాటికి వ్యాపార అవకాశాలు సృష్టించేలా చర్యలు తీసుకుంటున్నాయని సీసీఐ స్పష్టం చేసింది. ఈ సంస్థలు కొన్ని భాగస్వాములతో తక్కువ కమీషన్‌ డీల్‌ కుదుర్చుకుని ప్రత్యేక కాంట్రాక్టుల ద్వారా వాటికి ప్రయోజనం కలిగిస్తున్నాయని తేల్చింది.

Details

పెట్టుబడులు తోడ్పడతాయి : హల్దీరామ్

స్విగ్గీ తన ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యేకంగా నమోదు అవ్వడం ద్వారా వ్యాపార వృద్ధికి భరోసా ఇస్తుందని హామీ ఇస్తున్నట్లు సీసీఐ పత్రాలు వెల్లడించాయి. మరోవైపు హల్దీరామ్ భుజియావాలాకు పాంటోమత్‌కు చెందిన భారత్ వాల్యూ ఫండ్ (బీవీఎఫ్) సంస్థ నుండి రూ.235 కోట్ల పెట్టుబడులు లభించాయి. వ్యూహాత్మకంగా సంస్థను మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు ఈ పెట్టుబడులు తోడ్పడతాయని హల్దీరామ్ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ అగర్వాల్ తెలిపారు.