ఇంటెల్ సిఈఓ బాటలో జూమ్ సిఈఓ, తన వేతనంలో 98% కోత విధింపు
జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ మంగళవారం తన 15% అంటే దాదాపు 1,300 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. జూమ్ సిఈఓ ఎరిక్ యువాన్ తొలగింపులకు దారితీసిన పరిస్థితులకు తాను బాధ్యత వహిస్తానని, రాబోయే ఆర్థిక సంవత్సరానికి తన జీతం 98% తగ్గించడంతో పాటు కార్పొరేట్ బోనస్‌ను వదులుకుంటున్నానని చెప్పారు. ఈ పొరపాటు చర్యలకు నేను జవాబుదారీగా ఉన్నాను. అందుకే జవాబుదారీతనాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లో ఇలా చూపించాలనుకుంటున్నాని ఆయన సృష్టం చేశారు. మహమ్మారి సమయంలో ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫాం వృద్ధిని సాధించిందని, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వేగంగా అభివృద్ది అయిందని యువాన్ చెప్పారు.
ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్ సభ్యులు బేస్ శాలరీ 20 శాతంకు తగ్గింపు
జూమ్ సంస్థలోని ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్ సభ్యులు తమ బేస్ శాలరీ 20 శాతం తగ్గించుకుంటారని, 2023లో కార్పొరేట్ బోనస్ వారికి ఇవ్వడం లేదని ఆయన ఉద్యోగులకు చెప్పారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, యువాన్ గత సంవత్సరం బేస్ శాలరీ $301,731, కానీ అతని మొత్తం జీతం $1.1 మిలియన్. ఇప్పుడు 98 శాతం వేతన కోతతో, 2023కి జూమ్ సిఈఓ కొత్త జీతం $ 6,034.62 అవుతుంది. తొలగిస్తున్న ఉద్యోగులకు 16 వారాల జీతం, హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు 1:1 కోచింగ్, వర్క్‌షాప్‌లు, నెట్‌వర్కింగ్ గ్రూపులు లాంటివి ఉన్న అవుట్‌ప్లేస్‌మెంట్ సేవలను అందిస్తారు.