Ajith Kumar: హీరో అజిత్‌కు పెను ప్రమాదం.. రేసింగ్ ట్రాక్‌పై పల్టీలు కొట్టిన కారు!
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. స్పెయిన్‌లో రేసింగ్ సందర్భంగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి ట్రాక్‌పై పల్టీలు కొట్టింది.
అయితే ప్రమాదం జరిగిన వెంటనే అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అజిత్ రేసింగ్ టీమ్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది.
హీరో సురక్షితంగా ఉన్నారని తెలిపింది. ఈ ప్రమాదానికి అజిత్ కారణం కాదని, ఇతర కార్ల వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొంది. కొంతసేపటికే అజిత్ బయటకొచ్చి అభిమానులతో ఫొటోలు దిగారు.
రేస్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇక వీడియోను చూసిన ఆయన అభిమానులు జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు.
Details
ఇది రెండో ప్రమాదం
రెండు నెలల వ్యవధిలో అజిత్ ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా, ఆయన కారు అదుపుతప్పి సమీపంలోని గోడను ఢీకొంది.
ఆ ప్రమాదంలో వాహనం ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ, అజిత్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.
అయినా ఆ రేసింగ్ ఈవెంట్‌లో ఆయన టీమ్ విజయాన్ని అందుకుంది.
రేసింగ్ అంటే అజిత్‌కి మక్కువ
సినిమాల నుంచి బ్రేక్ దొరికితే, అజిత్ బైకులు, కార్లతో విహరిస్తుంటారు. కొన్ని నెలల క్రితం ఆయన గంటకు 234 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన వీడియో వైరల్ అయ్యింది.
అంతేకాదు మోటార్ సైకిల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఓ స్టార్టప్‌ను కూడా ప్రారంభించారు.