
Udayabhanu : 'ఇక్కడ పెద్ద సిండికేట్ ఎదిగింది'.. యాంకరింగ్‌పై ఉదయభాను సంచలన వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు టెలివిజన్ ప్రపంచంలో ఒక్క సమయంలో స్టార్ యాంకర్‌గా వెలుగొందిన ఉదయభాను తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితిస్తున్నాయి. సుహాస్ హీరోగా నటిస్తున్న 'ఓభామ అయ్యో రామా' ఈవెంట్‌కు యాంకరింగ్ చేసిన ఆమె... స్టేజ్‌పైనే ఓపెన్‌గా తన మనసులో మాటలు బయటపెట్టింది. ఈవెంట్ సందర్భంగా ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉదయభాను చాలా రోజుల తర్వాత మళ్లీ యాంకరింగ్ చేస్తున్నారు. ఇలానే కొనసాగాలని అన్నాడు. అయితే దానికి ఆమె తక్షణమే స్పందిస్తూ అంతేమీ లేదు... మళ్లీ చేస్తానో లేదో గ్యారెంటీ లేదు. రేపు ఈవెంట్ ఉందంటే, గంట ముందు వరకు వస్తామో లేదో కూడా తెలీదు.
Details
ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందన ఇదే
ఇక్కడ ఇప్పుడు చాలా పెద్ద సిండికేట్ ఎదిగింది. ఏం చెప్పినా హార్ట్ నుండి చెప్తున్నా అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలో నడుస్తున్న సిండికేషన్‌పై మరోసారి దృష్టి వెళ్లేలా చేశాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల ఈవెంట్లలో ఒకే యాంకర్లు తిరుగుతూ కనిపించడం కొత్త విషయం కాదు. చిన్న ఈవెంట్లకు మాత్రమే కొత్తవారికి అవకాశాలు లభిస్తున్నాయని పరిశ్రమలో కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయభాను చేసిన వ్యాఖ్యలు ఆ విమర్శలకు బలాన్నిస్తుండగా, మరికొందరైతే ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఇకపోతే, పెళ్లి తర్వాత ఆమె మెల్లగా పరిశ్రమ నుంచి తగ్గిపోవడంతో అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. చాలా మంది అభిమానులు ఆమె మళ్లీ యాంకరింగ్‌లో యాక్టివ్‌గా కనిపించాలని కోరుకుంటున్నారు.