సమంత ఒడిలో కూర్చుని సెల్ఫీ తీసుకున్న కోతి: వైరల్ అవుతున్న ఫోటోలు
మయోసైటిస్ చికిత్స కోసం సమంత అమెరికా వెళ్ళనుందని, అందుకే సినిమాలకు సంవత్సరం పాటు బ్రేక్ చెప్పిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇండోనేషియా దేశం బాలిలో సమంత సేదదీరుతోంది. ప్రకృతి అందాల నడుమ తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటోంది. తాజాగా బాలి నుండి సమంత షేర్ చేసిన ఇన్స్ టాగ్రామ్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. తన ఒడిలో కూర్చుని సెల్ఫీ తీసుకుంటున్న కోతి ఫోటోను ఇన్స్ టాలో షేర్ చేసింది సమంత. బాలిలో ఉన్న సమంత, తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం 4డిగ్రీల చల్లని నీటిలో ఆరు నిమిషాల పాటు ఉండడం, ఉదయం యోగా, ధ్యానం, వ్యాయామం చేస్తున్నట్టు తెలుస్తోంది.