Ram Charan : కొత్త హెయిర్ స్టైల్ తో రామ్ చరణ్.. ఆలిమ్ హకీమ్ ఫోటోలు వైరల్
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ చాలా మంది స్టార్ హీరోలకు కొత్త లుక్స్ ఇవ్వడం మనం చూశాం. ఎన్టీఆర్, మహేష్,చిరంజీవి తదితరుల లుక్స్ పోస్ట్ చేయడం మనం చూశాం. ఇంతకు ముందు కూడా రామ్ చరణ్‌కి కూడా రెండు, మూడు సార్లు కొత్త హెయిర్ స్టైల్స్ చేసి ఆ ఫోటోలని పోస్ట్ చేసాడు. తాజాగా మరోసారి రామ్ చరణ్ కి కొత్త హెయిర్ స్టైల్ చేసిన అలీమ్ ఖాన్ ఆ ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అది వైరల్ అవుతోంది. 'రంగస్థలం' హీరో ఈ కొత్త లుక్‌లో ఉబెర్ కూల్‌గా కనిపిస్తున్నాడు.ఈ ఫొటోల్లో చరణ్ వైట్ టీషర్ట్ వేసుకొని, కళ్ళజోడు పెట్టుకొని, సరికొత్త హెయిర్ స్టైల్ తో అదరగొట్టేసాడు.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్
ఈ ఫొటోతో అలీమ్ హకీమ్ బాగా పాపులర్ అవుతున్నారు. 'ఆర్ ఫర్ రామ్ చరణ్' అని రాశారు. ఇది అతని రాబోయే చిత్రానికి సంబంధించిన లుక్ ఆ లేదా ఏదైనా కొత్త యాడ్ షూట్ ఆ అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న 'గేమ్ ఛేంజర్' వారి బ్యానర్‌లో 50వ చిత్రం కాగా, కియారా అద్వానీ కథానాయిక. ప్రముఖ నటీనటులు ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్,అంజలి తదితరులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజర్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని తెలుస్తోంది.